క‌న్న‌డంలో రంగ‌స్థ‌ల

  • Published By: venkaiahnaidu ,Published On : March 5, 2019 / 07:26 AM IST
క‌న్న‌డంలో రంగ‌స్థ‌ల

Updated On : March 5, 2019 / 7:26 AM IST

క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ డైరక్షన్ లో రామ్ చరణ్,సమంత హీరో హీరోయిన్ లుగా నటించి…2018లో విడుదలై టాలీవుడ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన రంగస్థలం సినిమా ఇప్పుడు కన్నడలో డబ్ అవుతుంది. డబ్బింగ్ పనులు దాదాపు పూర్తి అయినట్లు తెలుస్తోంది. 
Also Read : ప్రభాస్ ను కొట్టలేదు.. జస్ట్ తాకింది అంతే..!

మార్చి నెలాఖరులో కన్నడ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ కానుంది. కన్నడలో “రంగస్థల”టైటిల్ తో ఈ సినిమా విడుదల కానుంది. జాక్ మంజూ తన బ్యానర్ లో ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. 2018 మార్చి-30న విడుదలైన రంగస్థలం 100 కోట్ల క్లబ్ లో చేరి బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ కొట్టింది. కర్ణాటకలో కూడా రామ్ చరణ్ కు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు
Also Read : షాక్ ఇచ్చిన మహేష్ బాబు.. సినిమా ఆగిపోయిందట!