Rana Daggubati : ‘అరణ్య’ కోసం అతిథులుగా..

తెలుగు సినీ ఇండస్ట్రీ వరుస షూటింగ్స్, రిలీజులు, ప్రీ రిలీజ్, సక్సెస్ మీట్‌లతో కళకళలాడుతోంది. రానా దగ్గుబాటి మెయిన్ లీడ్‌గా నటించిన మూవీ ‘అరణ్య’.. విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియ పిల్గోంకర్, సామ్రాట్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Rana Daggubati : ‘అరణ్య’ కోసం అతిథులుగా..

Aranya Pre Release Event

Updated On : March 17, 2021 / 4:04 PM IST

Aranya Pre Release Event: తెలుగు సినీ ఇండస్ట్రీ వరుస షూటింగ్స్, రిలీజులు, ప్రీ రిలీజ్, సక్సెస్ మీట్‌లతో కళకళలాడుతోంది. రానా దగ్గుబాటి మెయిన్ లీడ్‌గా నటించిన మూవీ ‘అరణ్య’.. విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియ పిల్గోంకర్, సామ్రాట్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ప్రేమఖైదీ’, ‘గజరాజు’, ‘రైలు’ వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రభు సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం హిందీలో ‘హథీ మేరీ సాథీ’, తమిళ్‌లో ‘కాడన్’ పేర్లతో రిలీజ్ అవుతోంది.

Read>>>ఏనుగుల ఇంట్లో మనుషుల అరాచకం.. ఎమోషనల్‌గా ‘అరణ్య’ ట్రైలర్..

ఇప్పటివరకు విడుదల చేసిన ప్రోమోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మార్చి 26న తెలుగుతో పాటు హిందీ, తమిళ్ భాషల్లోనూ భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘అరణ్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ చేశారు.

Read>>>Hrudayame : రానా జీవించేశాడు.. ఏడిపించేశాడు..

మార్చి 21 ఆదివారం మధ్యాహ్నం 1 గంటనుండి హైదరాబాద్‌లోని హోటల్ పార్క్ హయాత్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టార్ట్ కానుంది. విక్టరీ వెంకటేష్, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.