Kothapallilo Okappudu : ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ మూవీ రివ్యూ.. కేరాఫ్ కంచరపాలెం నిర్మాత దర్శకురాలిగా మారి..
కేరాఫ్ కంచరపాలెం లాంటి సినిమాని నిర్మించిన ప్రవీణ దర్శకురాలిగా మారి కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమాతో రావడంతో ఈ సినిమాపై కాస్త ఆసక్తి నెలకొంది.

Kothapallilo Okappudu
Kothapallilo Okappudu : కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలతో నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ పరుచూరి దర్శకురాలిగా మారి తెరకెక్కించిన సినిమా ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. మనోజ్ చంద్ర, రవీంద్ర విజయ్, మోనిక టి, ఉష బోనెలా, బెనర్జీ, ఫణి, బొంగు సత్తి, ప్రేమ్‌సాగర్.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాని రానా విడుదల చేస్తున్నారు. కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా నేడు జులై 18న థియేటర్స్ లో విడుదల అయింది.
కథ విషయానికొస్తే.. కొత్తపల్లి అనే గ్రామంలో అప్పన్న(రవీంద్ర విజయ్) అందరికి వడ్డీకి డబ్బులు ఇచ్చి అవి వసూలు చేసుకోడానికి అందర్నీ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అప్పన్న వద్ద రామకృష్ణ(మనోజ్ చంద్ర) పనిచేస్తూ అందరికి సాయంగా ఉంటాడు. రామకృష్ణ ఆ ఊరిపెద్ద రెడ్డి(బెనర్జీ)కూతురు సావిత్రి(మౌనిక టి)ని ప్రేమిస్తూ ఉంటాడు. ఈ విషయం ఆమెకు చెప్పడానికి మధ్యలో అందం(ఉషా బోనెల) సాయం కోరతాడు రామకృష్ణ. ఈ క్రమంలో రామకృష్ణకు – అందంకు పెళ్లి ఫిక్స్ చేస్తారు. వీరిద్దరి పెళ్లి జరిగియే సమయానికి అప్పన్న వచ్చి రామకృష్ణని తీసుకెళ్ళిపోతాడు. ఆ తర్వాత అనుకోకుండా యాక్సిడెంట్ లో అప్పన్న చనిపోతాడు. మరి రామకృష్ణ పెళ్లి ఎవరితో జరిగింది? అప్పన్న చనిపోయాక రామకృష్ణ ఏం చేసాడు? అతని జీవితం ఎలా మారింది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Junior : ‘జూనియర్’ మూవీ రివ్యూ.. జెనీలియా రీ ఎంట్రీ సినిమా ఎలా ఉందంటే..?
సినిమా విశ్లేషణ.. కేరాఫ్ కంచరపాలెం లాంటి సినిమాని నిర్మించిన ప్రవీణ దర్శకురాలిగా మారి కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమాతో రావడంతో ఈ సినిమాపై కాస్త ఆసక్తి నెలకొంది. ఫస్ట్ హాఫ్ అంతా విలేజ్ బ్యాక్ డ్రాప్ సీన్స్, అక్కడ మనుషులు, కొన్ని కామెడీ సీన్స్ తో సింపుల్ గా సాగిపోతుంది. ఇంటర్వెల్ కి ఆసక్తికర బ్యాంగ్ ఇచ్చారు. సెకండ్ హాఫ్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ అయ్యాయి.
మనుషులు ఏ సమయంలో ఎలా బిహేవ్ చేస్తారు అనే పాయింట్ ని చెప్పడానికి ప్రయత్నించారు. క్లైమాక్స్ మాత్రం హడావిడిగా ముగించేసినట్టు అనిపిస్తుంది. అప్పన్న బండిపై చూపించే కొన్ని సీన్స్, ఊరి జనాలు సడెన్ గా మారడం.. లాంటి పలు సీన్స్ అంతగా కనెక్ట్ అవ్వవు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో అక్కడి మనుషులు ఎలా ఉంటారు, అందులో ఓ వ్యక్తి జీవితం ఎలా ఉంది అన్నట్టు చూపించారు.
నటీనటుల పర్ఫార్మెన్స్.. మెయిన్ లీడ్ చేసిన మనోజ్ చంద్ర బాగానే మెప్పించాడు. ఉషా బోనేలా సినిమాకు చాలా ప్లస్ అయింది. సింపుల్ విలేజ్ లుక్స్ లో కనిపిస్తూ నవ్విస్తూనే నటనతో మెప్పించింది. మౌనిక పర్వాలేదనిపించింది. రవీంద్ర విజయ్ తన పాత్రలో రెండు షేడ్స్ తో ఒదిగిపోయాడు. బెనర్జీ, బాబు మోహన్ లకు చాలా కాలం తర్వాత మంచి పాత్రలే పడ్డాయి. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
Also Read : Supritha : తల్లితో కలిసి శివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసిన సుప్రీత.. ఫొటోలు..
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ విలేజ్ లుక్స్ పర్ఫెక్ట్ గా చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పాటలు బాగానే ఉన్నాయి. ఎడిటింగ్ లో మాత్రం కొన్ని సీన్స్ కి మధ్య జంప్ చేసి వేరే సీన్స్ తో కంటిన్యుటీ మిస్ అయిందని అనిపిస్తుంది. ఓ మాములు కథని విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఎమోషన్ తో ఓ మంచి పాయింట్ తో చెప్పే ప్రయత్నం చేసారు దర్శకురాలు ప్రవీణ పరుచూరి. నిర్మాణ పరంగా కూడా సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ సినిమా కామెడీ ఎమోషన్స్ తో సాగిన విలేజ్ డ్రామా. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.