‘కుమారి మాస్’.. వీడియో షేర్ చేసిన రానా..

  • Published By: Mahesh ,Published On : April 29, 2020 / 05:46 AM IST
‘కుమారి మాస్’.. వీడియో షేర్ చేసిన రానా..

Updated On : April 29, 2020 / 5:46 AM IST

పాపులర్ ఇండో-అమెరికన్ ర్యాపర్, సింగర్, సాంగ్ రైటర్ రాజా కుమారి లేటెస్ట్ మ్యూజిక్ వీడియో ‘N.R.I.’ ఏప్రిల్ 25న అఫీషియల్ స్ట్రీమింగ్ స్టార్ట్ అయింది. విడుదల చేసిన కొద్దిసేపటికే పలు మ్యూజికల్ యాప్స్‌తో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది. Sirah, Rob Knox లతో కలిసి ఈ పాటకు లిరిక్స్ రాసిన రాజా కుమారి ఎప్పటిలానే సూపర్బ్‌గా పాడింది. కాస్ట్యూమ్స్, లొకేషన్స్, విజువల్స్ ఈ వీడియోకు ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా పొడవాటి జడ కుమారికి బాగా సూట్ అయింది. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి ‘N.R.I.’ వీడియోను షేర్ చేశారు. సాంగ్ బాగా నచ్చడంతో ‘కుమారి మాస్’ అంటూ రానా ఈ సాంగ్ లింక్ పోస్ట్ చేశారు. ‘‘I love it when they big mad.. Talkin’ shit on Instagram..They don’t know I’m woke, I guess they really think I’m ignorant’’.. అంటూ క్యాచీ లిరిక్స్‌తో తీసుకున్న థీమ్ అర్థమయ్యేలా రాజా కుమారి చేసిన ‘N.R.I.’ వీడియో వైరల్ అవుతోంది.