నేను రాక్షసుడిని : రానా కొత్త మూవీ హిరణ్యకశిప

  • Published By: veegamteam ,Published On : March 26, 2019 / 08:12 AM IST
నేను రాక్షసుడిని : రానా కొత్త మూవీ హిరణ్యకశిప

Updated On : March 26, 2019 / 8:12 AM IST

మరోసారి నెగెటివ్ రోల్ లో కనిపించబోతున్నాడు రానా. పురాణ కథలోని రాక్షసుడి పాత్రలో కనిపించబోతున్నాడు. టైటిల్ హిరణ్యకశిప. ఈ పేరు వింటేనే.. రాక్షసుడు గుర్తుకొస్తాడు. అలాంటి పాత్రలో.. నెగెటివ్ రోల్ చేయబోతున్నాడు రానా. భారీ బడ్జెట్ తో.. అంటే 180 కోట్ల రూపాయలతో తెరకెక్కబోతున్న ఈ మూవీకి దర్శకుడు గుణశేఖర్. దేశంలోని అన్ని భాషల్లో తెరకెక్కుతోంది.

30 కోట్ల రూపాయలతో భారీ సెట్ కూడా వేస్తున్నారు. రామానాయుడు స్టూడియోలో ప్లాన్ చేస్తున్నారు. గ్రాఫిక్స్ కూడా భారీగా ఉండబోతున్నాయి ఈ మూవీలో. దీని కోసం లండన్ కు చెందిన నిపుణులు వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే కథపై రెండేళ్లుగా పరిశోధన చేసిన గుణశేఖర్.. ఇప్పుడు మేకింగ్ పై దృష్టి పెట్టారు. రానా ఓకే చెప్పటంతో ప్రొడక్షన్ వర్క్స్ ఊపందుకున్నాయి.

ఈ మూవీలో వైకుంఠం, ఇంద్రలోకం రెండు సెట్లు ఉంటాయనేది సినీ ఇండస్ట్రీ టాక్. స్కెచ్ డిజైన్స్ ప్రముఖ ఆర్టిస్ట్ ముఖేష్ సింగ్ ఆధ్వర్యంలో రూపొందుతున్నాయి. బాహుబలి తర్వాత ఆ స్థాయి బడ్జెట్, గ్రాఫిక్స్, కథ ఆధారంగా తెరకెక్కుతున్న మూవీ ఇదే అనే టాక్ ఉంది. రానా ప్రధాన పాత్ర పోషిస్తుండటంతో.. హైప్ క్రియేట్ అయ్యింది.

జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని డైరెక్టర్ గుణశేఖర్ అంటున్నారు. రాక్షసుడిగా రానా ఏ మేరకు మెప్పిస్తాడు అనేది ఆసక్తిగా మారింది. భల్లాలదేవగా భయపెట్టిన యంగ్ స్టార్.. మరోసారి కూడా భయపెట్టటానికే ప్రయార్టీ ఇవ్వటం విశేషం.