Animal : బాక్సాఫీస్ ని షేక్ ఆడిస్తున్న యానిమల్.. ఎనిమిది రోజుల్లో ఏకంగా అన్ని వందల కోట్లు..
మొదటి రోజు యానిమల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 116 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. వారం రోజుల లోపే యానిమల్ సినిమా 500 కోట్లు కలెక్ట్ చేసింది.

Ranbir Kapoor Sandeep Reddy Vanga Animal Movie Eight Days Collections Details
Animal Collections : సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రణబీర్ కపూర్(Ranbir Kapoor), రష్మిక మందన్న(Rashmika Mandanna) జంటగా అనిల్ కపూర్, బాబీ డియోల్ ముఖ్య పాత్రల్లో నాన్న ఎమోషన్స్ తో మాస్ యాక్షన్ జోడించి తెరకెక్కిన సినిమా ‘యానిమల్’. డిసెంబర్ 1న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
మొదటి ఆట నుంచే యానిమల్ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకొని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. మొదట్నుంచి చివరి వరకు నడిపించిన నాన్న ఎమోషన్, మాస్ యాక్షన్ ఫైట్ సీన్స్, రణబీర్ యాటిట్యూడ్, రష్మికతో రణబీర్ రొమాన్స్, సెకండ్ హాఫ్ లో త్రిప్తి స్పెషల్ అప్పీరెన్స్.. ఇలా అన్ని ప్రేక్షకులని మెప్పించాయి. ముందునుంచి సినిమా భారీ హిట్ అవుతుందని అంచనాలు ఉన్నాయి. అనుకున్నట్టే యానిమల్ సినిమా కలెక్షన్స్ కూడా భారీగా వస్తున్నాయి.
మొదటి రోజు యానిమల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 116 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. వారం రోజుల లోపే యానిమల్ సినిమా 500 కోట్లు కలెక్ట్ చేసింది. ఎనిమిది రోజులకు గాను యానిమల్ సినిమా 600 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి దూసుకుపోతుంది. సినిమా రిలీజయి వారం రోజులవుతున్నా ఇంకా కలెక్షన్స్ వస్తున్నాయి. సినిమా రిలీజయిన రెండో శుక్రవారం 21 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది యానిమల్ సినిమా. నేడు, రేపు కూడా వీకెండ్ ఉండటంతో ఈ కలెక్షన్స్ ఇంకా దూసుకెళ్లనున్నాయి.
Also Read : Prabhas : కల్కి షూటింగ్ సెట్‌లో నెట్‌ఫ్లిక్స్ CEO టెడ్ సరండోస్.. ప్రభాస్ లుక్ చూశారా? గడ్డం, మీసాలతో..
రణబీర్ కెరీర్ లోనే ఇవి బిగ్గెస్ట్ కలెక్షన్స్ కావడం గమనార్హం. ఇక మన తెలుగు డైరెక్టర్ సందీప్ వంగా యానిమల్ సినిమాతో బాలీవుడ్ ని షేక్ చేసేస్తున్నాడు. 1000 కోట్ల టార్గెట్ తో యానిమల్ దూసుకుపోతుంది. అయితే 1000 కోట్లు రాకపోయినా 800 కోట్లు మాత్రం వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాతో రణబీర్ స్టార్ డమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది బాలీవుడ్ లో.
The BIGGEST 2nd FRIDAY ever ?
Book your Tickets ?️ https://t.co/QvCXnEetUb#AnimalTakesOverTheNation #AnimalInCinemasNow #Animal #AnimalHuntBegins #BloodyBlockbusterAnimal #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23… pic.twitter.com/2EA17lOfXY
— T-Series (@TSeries) December 9, 2023
The Blockbuster’s Triumph continues ?
Book your Tickets ?️ https://t.co/QvCXnEetUb#AnimalTakesOverTheNation #AnimalInCinemasNow #Animal #AnimalHuntBegins #BloodyBlockbusterAnimal #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23… pic.twitter.com/V7TwmRDFI2
— T-Series (@TSeries) December 9, 2023