Rani Chatterjee : సాజిద్ ఖాన్ పై మరో హీరోయిన్ విమర్శలు.. నాకు ఐటెం సాంగ్ ఆఫర్ ఇప్పిస్తానని చెప్పి..

తాజాగా మరో నటి సాజిద్ ఖాన్ పై తీవ్ర విమర్శలు చేసింది. భోజ్ ఫురి నటీమణి రాణి ఛటర్జీ పలు బాలీవుడ్ సినిమాల్లోనూ నటించింది. ఓ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సాజిద్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. రాణి ఛటర్జీ మాట్లాడుతూ...............

Rani Chatterjee : సాజిద్ ఖాన్ పై మరో హీరోయిన్ విమర్శలు.. నాకు ఐటెం సాంగ్ ఆఫర్ ఇప్పిస్తానని చెప్పి..

Rani Chatterjee sensational comments on sajid khan

Updated On : October 18, 2022 / 7:16 AM IST

Rani Chatterjee :  బాలీవుడ్ దర్శక నిర్మాత సాజిద్ ఖాన్ పై 2018లో మీటూ ఉద్యమం జరిగినప్పుడు అనేక ఆరోపణలు వచ్చాయి. చాలా మంది నటీమణులు సాజిద్ ఖాన్ తమతో మిస్ బిహేవ్ చేశాడని, ఆఫర్స్ ఇప్పిస్తానని చెప్పి తమను వాడుకున్నాడని ఆరోపణలు చేశారు. తాజాగా హిందీ బిగ్ బాస్ లోకి సాజిద్ ఖాన్ ని కంటెస్టెంట్ గా తీసుకోవడంతో మరోసారి అతనిపై విమర్శలు భారీగా వస్తున్నాయి. మందన కరిమి, ఆహానా కుమ్రా, షెర్లిన్ చోప్రా, ఉర్ఫీ జావేద్, తనుశ్రీ దత్తా.. లాంటి పలువురు బాలీవుడ్ యాక్టర్స్ సాజిద్ ఖాన్ పై తీవ్ర విమర్శలు చేస్తూ బిగ్ బాస్ ని కూడా తప్పు పడుతున్నారు.

తాజాగా మరో నటి సాజిద్ ఖాన్ పై తీవ్ర విమర్శలు చేసింది. భోజ్ ఫురి నటీమణి రాణి ఛటర్జీ పలు బాలీవుడ్ సినిమాల్లోనూ నటించింది. ఓ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సాజిద్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. రాణి ఛటర్జీ మాట్లాడుతూ.. ”హిమ్మత్ వాలా సినిమా సమయంలో నాకు ఓ ఐటెం సాంగ్ ఆఫర్ ఇప్పిస్తానని చెప్పి తన ఫ్లాట్ కి రమ్మన్నారు. నేను వెళ్తే అక్కడ ఎవ్వరూ లేరు, తను ఒక్కడే ఉన్నాడు. ఐటెంసాంగ్ లో చిన్న బట్టలు వేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి నా తొడల వరకు చూపించమన్నాడు. సాంగ్ కోసమే కదా నేను చూపించాను. ఆ తర్వాత నా బాడీ గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. నా దగ్గరికి వచ్చి నన్ను తాకాలని ప్రయత్నించాడు. నాతో మిస్ బిహేవ్ చేశాడు సాజిద్” అని తెలిపింది.

Priyamani : ప్రియమణి పాన్ ఇండియా సినిమా ‘డాక్టర్ 56’.. విజయ్ సేతుపతి చేతుల మీదుగా ఫస్ట్ లుక్..

అలాంటి వాడికి బిగ్ బాస్ లో ఎలా చోటిస్తారు అంటూ ఫైర్ అయింది. సాజిద్ పై ఆరోపణలు ఆగట్లేదు. ఇప్పటికే పలువురు నటీమణులు సాజిద్ పై తీవ్ర ఆరోపణలు చేయగా మరింతమంది ముందుకు వస్తున్నారు. కానీ బిగ్ బాస్ మాత్రం ఇవేమి పట్టించుకోకుండా సాజిద్ ని హౌజ్ లో కొనసాగిస్తోంది.