Shah Rukh – Ranveer : షారుఖ్‌ని పక్కన పెట్టి రణ్వీర్ సింగ్‌తో డాన్ సిరీస్.. డాన్ 3 గ్లింప్స్ రిలీజ్..

బాలీవుడ్ లో డాన్ ఎవరు అంటే అందరికి గుర్తుకు వచ్చే పేరు షారుఖ్. అయితే ఇప్పుడు కింగ్ ఖాన్ ని పక్కన పెట్టి రణ్వీర్‌తో..

Shah Rukh – Ranveer : షారుఖ్‌ని పక్కన పెట్టి రణ్వీర్ సింగ్‌తో డాన్ సిరీస్.. డాన్ 3 గ్లింప్స్ రిలీజ్..

Ranveer Singh play lead role in Don 3 instead of Shah Rukh Khan

Updated On : August 9, 2023 / 12:08 PM IST

Shah Rukh Khan – Ranveer Singh : బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్ కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘డాన్’ (Don). 1978 లో తెరకెక్కిన అమితాబ్ బచ్చన్ డాన్ సినిమా ఆధారంగా వచ్చిన ఈ మూవీలో షారుఖ్.. ప్రేక్షకుల మదిలో డాన్ గా గట్టి ముద్ర వేశాడు. 2006 లో వచ్చిన షారుఖ్ డాన్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఆ తరువాత దానికి కొనసాగింపుగా 2011 లో షారుఖ్ అండ్ అఖ్తర్ ఇద్దరు కలిసి డాన్ 2 ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. అది కూడా అద్భుత విజయాన్ని సాధించింది.

Bholaa Shankar : చిరంజీవి భోళాశంకర్ రిలీజ్ పై కేసు నమోదు.. ఎందుకో తెలుసా..?

ఇక బాలీవుడ్ డాన్ ఎవరు అంటే షారుఖ్ అనేలా ఈ రెండు సినిమాలు చేశాయి. దీంతో షారుఖ్ ని మరోసారి డాన్ పాత్రలో చూసేందుకు ఆడియన్స్ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు సడన్ గా డాన్ ప్లేస్ లోకి షారుఖ్ కి బదులుగా రణ్వీర్ సింగ్‌ వచ్చి చేరాడు. తాజాగా డాన్ 3 (Don 3) మూవీని అధికారికంగా అనౌన్స్ చేస్తూ ఒక టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఆ గ్లింప్స్ లో రణ్వీర్ ని డాన్ పాత్రలో చూపించారు. అయితే దర్శకుడు విషయంలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. మొదటి రెండు భాగాలను తెరకెక్కించిన ఫర్హాన్ అఖ్తర్ ఈ మూడో భాగాన్ని కూడా డైరెక్ట్ చేయబోతున్నాడు.

Allu Arjun : అల్లు అర్జున్ కూతురు అర్హ.. మొదటిరోజు స్కూల్ ఫోటో చూశారా..?

అయితే డాన్ గా షారుఖ్ ని బదులు రణ్వీర్ ని ఊహించుకోవడంలోనే ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ హీరో మార్పు విషయంలో ఏమన్నా ప్లాన్ ఉందా? అని సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే కాప్ యూనివర్స్, స్పై యూనివర్స్ అని బాలీవుడ్ సింగం సిరీస్, టైగర్ అండ్ పఠాన్ సిరీస్ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. ఈ క్రమంలోనే కొత్తగా డాన్ ఫ్రాంచైజ్ ని కూడా క్రియేట్ చేయబోతున్నారా? అనే డౌట్ కలుగుతుంది.