Ranveer Singh’s Movie: 83.. ట్రైలర్ వచ్చేసింది.. రోమాలు నిక్కబొడుచుకునేలా..
అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా 1983లో సాధించిన ప్రపంచకప్.. ఓ చరిత్ర!

83
Ranveer Singh 83: అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా 1983లో సాధించిన ప్రపంచకప్.. ఓ చరిత్ర! ఏ మాత్రం అంచనాల్లేని జట్టు విజయ తీరాలకు ఎలా చేరింది కపిల్ దేవ్. ఈ ఫీట్ సాధించడం అంత తేలికగా జరగలేదు. ఈ ఫీట్ వెనుక కథానాయకులు ఎందరో? అందులో అగ్ర నాయకుడు కపిల్ దేవ్. ఈ కథతో తెరకెక్కిన బాలీవుడ్ బయోపిక్ ’83’.
ఎన్నో ట్విస్ట్‌లతో అసాధారణ ప్రయాణాన్ని సాగించిన కపిల్ దేవ్ కథాంశమే మెయిన్ లీడ్‌గా తీసుకుని తెరకెక్కించిన ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ సమర్పణలో కబీర్‌ఖాన్ ఫిలిమ్స్ నిర్మాణంలో దీపికా పదుకొనె, సాజిద్ నడియద్‌వాలా, కబీర్ ఖాన్, నిఖిల్ ద్వివేది, విష్ణు ఇందూరి, 83 ఫిలింస్ లిమిటెడ్, ఫాంటమ్ ఫిలింస్ ఈ స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ మూవీని నిర్మించారు.
ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్‌గా ట్రైలర్ విడుదల చేసింది చిత్రయూనిట్. ట్రైలర్ రోమాలు నిక్కబొడుచుకునేలా చాలా బాగుంది అనేలా అభిప్రాయపడుతున్నారు విమర్శకులు అంటున్నారు. కపిల్ దేవ్‌గా రణ్వీర్ సింగ్, కపిల్ సతీమణి రూమీ భాటియాగా దీపికా పదుకొనె, సునీల్ గవాస్కర్‌గా తాహిర్ రాజ్ బాసిన్, కృష్ణమాచార్య శ్రీకాంత్‌గా జీవా, మదన్ లాల్‌గా హార్డీ సందు, మహీంద్రనాథ్ అమర్‌నాథ్‌గా సకీబ్ సలీమ్, బల్వీందర్ సంధుగా అమ్మి విర్క్, వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణిగా సాహిల్ కత్తార్, సందీప్ పాటిల్‌గా చిరాగ్ పాటిల్, దిలీప్ వెంగ్‌సర్కార్‌గా అదినాథ్ కొతారె, రవిశాస్త్రిగా కార్వా.. మేనేజర్ మాన్‌సింగ్‌గా పంకజ్ త్రిపాఠి కనిపించనున్నారు.
జూన్ 25, 1983న జరిగిన వెస్టిండీస్.. ఇండియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ గురించే ఎక్కువగా ఇందులో ఉండనుంది. ’83’ డిసెంబర్ 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది చిత్రయూనిట్. ట్రైలర్ చూస్తుంటే, కపిల్ దేవ్‌గా రణ్వీర్ సింగ్ పూర్తిగా ట్రాన్స్‌ఫాం అయినట్లు కనిపిస్తుంది. అద్భుతమైన షాట్స్‌తో ఇండియాకి విజయాన్ని అందించాడు కపిల్‌ను అద్భుతంగా చూపించారు.