Maruti Nagar Subramanyam : సీనియర్ ఆర్టిస్టులే మెయిన్ లీడ్స్ గా.. ఇంద్రజ, రావు రమేష్‌ కాంబోలో ‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’

హీరో, హీరోయిన్స్ లేకుండా సీనియర్ ఆర్టిస్టులో మెయిన్ లీడ్స్ లో మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే ఓ సినిమా రాబోతుంది. సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేష్, ఒకప్పటి హీరోయిన్ ఇంద్రజ మెయిన్ లీడ్స్ లో ఈ సినిమా తెరకెక్కనుంది................

Maruti Nagar Subramanyam : సీనియర్ ఆర్టిస్టులే మెయిన్ లీడ్స్ గా.. ఇంద్రజ, రావు రమేష్‌ కాంబోలో ‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’

Rao ramesh and indraja as main leads Maruti Nagar Subramanyam movie will start soon

Updated On : February 25, 2023 / 7:51 AM IST

Maruti Nagar Subramanyam :  ఇటీవల స్టార్ హీరోలు, హీరోయిన్స్ లేకపోయినా కంటెంట్ ఆధారంగా సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో అలాంటి కంటెంట్ సినిమా రాబోతుంది. హీరో, హీరోయిన్స్ లేకుండా సీనియర్ ఆర్టిస్టులో మెయిన్ లీడ్స్ లో మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే ఓ సినిమా రాబోతుంది. సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేష్, ఒకప్పటి హీరోయిన్ ఇంద్రజ మెయిన్ లీడ్స్ లో ఈ సినిమా తెరకెక్కనుంది.

రావు రమేష్ ప్రస్తుతం తెలుగు, తమిళ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా బిజీగా ఉన్నారు. తండి, విలన్, కమెడియన్ పాత్రలు వేస్తూ బిజీ ఆర్టిస్ట్ గా ఉన్నారు. చిన్న, పెద్ద అన్ని సినిమాల్లోనూ చేస్తున్నారు. ఇక ఒకప్పటి హీరోయిన్ ఇంద్రజ కొన్ని నెలల క్రితమే మళ్ళీ కంబ్యాక్ ఇచ్చింది. టీవీ షోలలో జడ్జిగా తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి ఇప్పుడు అమ్మ పాత్రలు వేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తోంది.

Parineeti Chopra : వాళ్ళని చూసి నాకు కూడా పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుంది.. ఎవరైనా మంచి అబ్బాయి ఉంటే చెప్పండి..

ఇప్పుడు రావు రమేష్, ఇంద్రజ మెయిన్ లీడ్స్ లో లక్ష్మణ్ అనే డైరెక్టర్ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే టైటిల్ తో ఓ కామెడీ సినిమాని తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ కి వెళ్లనుంది.