Rashmika Mandanna : చిన్నప్పట్నుంచి కలగన్నాను.. రష్మిక మందన్న ఎమోషనల్ పోస్ట్..
తాజాగా రష్మిక జపాన్ లో దిగిన కొన్ని ఫోటోలు షేర్ చేసి ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది.

Rashmika Mandanna Emotional Post on Japan Tour
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. టాలీవుడ్, బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. తాజాగా రెండు రోజుల క్రితం రష్మిక జపాన్ కి వెళ్ళింది. జపాన్(Japan) లోని క్రంచిరోల్ యానిమే అవార్డ్స్ ఈవెంట్ కి రష్మిక గెస్ట్ గా వెళ్ళింది. జపాన్ వెళ్లిన దగ్గర్నుంచి రష్మిక అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేస్తుంది.
ఇక జపాన్ లో రష్మికకు గ్రాండ్ వెల్కమ్ లభించింది. జపాన్ లో రష్మిక క్రేజ్ చూసి ఇక్కడి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. నిన్న రాత్రి జరిగిన క్రంచిరోల్ యానిమే అవార్డ్స్ ఈవెంట్ లో అదిరేటి డ్రెస్ వేసి తన అందాలతో స్టేజిపైకి వచ్చి అవార్డుని ప్రజెంట్ చేసింది. తాజాగా రష్మిక జపాన్ లో దిగిన కొన్ని ఫోటోలు షేర్ చేసి ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది.
Also Read : Rashmika Mandanna : జపాన్‌లో రష్మిక మందన్న హాట్ లుక్స్..
రష్మిక తన పోస్ట్ లో.. చిన్నప్పట్నుంచి నేను జపాన్ వెళ్లాలని కలగన్నాను. ఇది నిజంగా జరుగుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. యానిమే అవార్డ్స్ లో భాగం అయ్యాను, ఒకరికి అవార్డు ఇచ్చాను. ఇక్కడ అందరూ నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. వీళ్ళు ఇచ్చిన స్వాగతం, వీళ్ళు చూపించే ప్రేమ, ఇక్కడ వాతావరణం, ఇక్కడ ప్రజలు, ఇక్కడి ఫుడ్.. అన్ని అద్భుతంగా ఉన్నాయి. థ్యాంక్యూ జపాన్. రియల్లీ ఐ లవ్ యు. జపాన్ చాలా స్పెషల్. ప్రతి సంవత్సరం మళ్ళీ మళ్ళీ నేను ఇక్కడికి రావాలనుకుంటున్నాను అని ఎమోషనల్ గా తెలిపింది. దీంతో రష్మిక పోస్ట్ వైరల్ గా మారింది.