Rashmika Mandanna : జపనీస్ టాప్ ఫ్యాషన్ బ్రాండ్ కి ఫస్ట్ ఇండియన్ బ్రాండ్ అంబాసిడర్ గా రష్మిక మందన్న
జపాన్ కి చెందిన టాప్ ఫ్యాషన్ బ్రాండ్ Onitsuka Tiger కి రష్మిక బ్రాండ్ అంబాసిడర్ గా సంతకం చేసింది. ఇటీవల రష్మిక ఇటలీలో జరిగిన మిలాన్ ఫ్యాషన్ వీక్ కి హాజరయిన సంగతి తెలిసిందే. దేశ విదేశాల నుంచి పలువురు స్టార్స్ ఈ ఫ్యాషన్ ఈవెంట్ కి వచ్చారు. ఈ కార్యక్రమంలోనే రష్మిక..................

Rashmika Mandanna is India’s first brand advocate for the iconic Japanese fashion brand Onitsuka Tiger
Rashmika Mandanna : మన సెలబ్రిటీలు సినిమాలతో పాటు యాడ్స్, ప్రమోషన్స్ కూడా చేస్తారని తెలిసిందే. టాప్ బ్రాండ్స్ కి సైతం మన సెలబ్రిటీలు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నారు. తాజాగా రష్మిక మందన్న ఓ టాప్ ఫ్యాషన్ బ్రాండ్ కి అంబాసిడర్ గా సెలెక్ట్ అయింది. రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఓ పక్కన సినిమాలు చేస్తూనే మరోపక్క వరుసగా యాడ్స్ చేస్తూ కూడా బిజీగా ఉంటూ బాగా సంపాదిస్తుంది. ఇప్పటికే రష్మిక చేతిలో అనేక బ్రాండ్స్ ఉన్నాయి. తాజాగా ఈ లిస్ట్ లో మరోటి చేరింది.
జపాన్ కి చెందిన టాప్ ఫ్యాషన్ బ్రాండ్ Onitsuka Tiger కి రష్మిక బ్రాండ్ అంబాసిడర్ గా సంతకం చేసింది. ఇటీవల రష్మిక ఇటలీలో జరిగిన మిలాన్ ఫ్యాషన్ వీక్ కి హాజరయిన సంగతి తెలిసిందే. దేశ విదేశాల నుంచి పలువురు స్టార్స్ ఈ ఫ్యాషన్ ఈవెంట్ కి వచ్చారు. ఈ కార్యక్రమంలోనే రష్మిక ఈ జపాన్ బ్రాండ్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది. జపనీస్ ఫ్యాషన్ బ్రాండ్ Onitsuka Tiger కి రష్మిక బ్రాండ్ అంబాసిడర్ గా ఒప్పుకోవడంతో ఈ బ్రాండ్ కి సంతకం చేసిన మొదటి ఇండియన్ స్టార్ గా రికార్డ్ కొట్టేసింది రష్మిక.
ఈ విషయాన్ని రష్మిక తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. కొత్త ప్రయాణం మొదలైంది. ఇపుడు నేను జపనీస్ ఫ్యాషన్ బ్రాండ్ Onitsuka Tiger కి ఫస్ట్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ ని. కొత్త కొత్త కలెక్షన్స్ ఈ బ్రాండ్ నుంచి వస్తున్నాయి. ఇటీవల నేను మిలాన్ ఫ్యాషన్ వీక్ లో అలరించాను. అక్కడ వీరి బ్రాండ్ కి చెందిన దుస్తులే వేసుకొని ప్రదర్శించాను. వీరి నుంచి మరిన్ని ఫ్యాషన్ స్టైల్స్ రానున్నాయి. మరిన్ని కలెక్షన్స్ కోసం వేచి చుడండి అని పోస్ట్ చేసింది. అయితే Onitsuka Tiger బ్రాండ్ ఇండియాలో తమ బిజినెస్ ని పెంచుకోడానికి ప్రస్తుతం నేషనల్ క్రష్ అని పిలిపించుకుంటున్న రష్మికని బ్రాండ్ అంబాసిడర్ గా చేసుకున్నట్టు తెలుస్తుంది.