Rashmika Mandanna : నా బాల్యం అంతా హాస్టల్ లోనే అయిపోయింది.. స్నేహితులే నా కుటుంబం.. ఎమోషనల్ అయిన రష్మిక..
తాజాగా రష్మిక ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ తన బాల్యం, తన స్టడీ గురించి మాట్లాడింది. రష్మిక మాట్లాడుతూ.. ''నా బాల్యం, నా స్టడీ అంతా హాస్టల్స్ లోనే అయిపోయింది. ఎక్కడికి వెళ్లినా నా చుట్టూ..............

Rashmika Mandanna shares about her school and hostel life
Rashmika Mandanna : రష్మిక మందన్నా ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ ఫేమ్ తెచ్చుకుంది ఈ నేషనల్ క్రష్. త్వరలో రష్మిక అమితాబ్ తో కలిసి నటించిన ‘గుడ్ బై’ సినిమా బాలీవుడ్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ తో రష్మిక బాలీవుడ్ లో బిజీబిజీగా ఉంది.
తాజాగా రష్మిక ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ తన బాల్యం, తన స్టడీ గురించి మాట్లాడింది. రష్మిక మాట్లాడుతూ.. ”నా బాల్యం, నా స్టడీ అంతా హాస్టల్స్ లోనే అయిపోయింది. ఎక్కడికి వెళ్లినా నా చుట్టూ స్నేహితులే ఉండేవారు. స్నేహితులు కూడా నా కుటుంబం అని భావించాను. టీచర్లతో చాలా మంచిగా ఉండేదాన్ని. హాస్టల్ లో ఉన్నప్పుడు నా టీచర్స్ లోనే నా పేరెంట్స్ ని చూసుకున్నాను. ఇక స్కూల్ లో నేను యావరేజ్ స్టూడెంట్ ని. ఆ తర్వాత ఇంటర్, డిగ్రీలలో మాత్రం బాగా చదివాను. నాకు మ్యాథ్స్, సైన్స్ అంటే చాలా భయం” అని తెలిపింది. ఈ సందర్భంగా తన స్కూల్, కాలేజీ స్నేహితులని తలుచుకొని ఎమోషనల్ అయింది రష్మిక.