Annusriya Tripathi : రామ్ చరణ్ నటన అంటే ఇష్టం.. ‘ర‌జాకార్’ ఫేమ్ అనుశ్రీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ..

రజాకార్ సినిమా మంచి విజయం సాధించగా ఈ సినిమాలో నిజం రాజు భార్యగా నటించిన అనుశ్రీ త్రిపాఠి మీడియాతో ముచ్చటించింది. సినిమా గురించి, తన గురించి పలు ఆసక్తికర విషయాలని తెలిపింది.

Annusriya Tripathi : రామ్ చరణ్ నటన అంటే ఇష్టం.. ‘ర‌జాకార్’ ఫేమ్ అనుశ్రీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ..

Razakar Movie fame Annusriya Tripathi Exclusive Interview

Updated On : March 16, 2024 / 5:21 PM IST

Annusriya Tripathi : హైదరాబాద్ నిజాం సంస్థానం భారతదేశంలో ఎలా విలీనమైంది, అప్పట్లో రజాకార్ల అకృత్యాలు ఎలా ఉన్నాయి అనే కథాంశంతో తెరకెక్కిన రజాకార్ సినిమా మార్చ్ 15న రిలీజయి మంచి విజయం సాధించింది. సినిమాని చాలా ఎమోషన్ తో, దేశభక్తి ఎలివేషన్స్ తో చాలా గ్రాండ్ గా తెరకెక్కించారు. మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ దక్కించుకుంది. యాట సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణ రెడ్డి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కగా రజాకార్ సినిమాలో.. బాబీ సింహ, అనసూయ, వేదిక, ప్రేమ, ఇంద్రజ, అనుశ్రీ త్రిపాఠి, మకరంద దేశ్ పాండే, తేజ్ సప్రూ, రాజ్ అర్జున్.. ఇలా అనేకమంది స్టార్ నటులు నటించారు.

తాజాగా రజాకార్(Razakar) సినిమా మంచి విజయం సాధించగా ఈ సినిమాలో నిజం రాజు భార్యగా నటించిన అనుశ్రీ త్రిపాఠి మీడియాతో ముచ్చటించింది. సినిమా గురించి, తన గురించి పలు ఆసక్తికర విషయాలని తెలిపింది.

మీ నేపధ్యం, ఈ సినిమాలోకి ఎలా వచ్చారు?

నేను బెంగళూరులో చదివేటప్పుడే థియేటర్స్ గ్రూప్ లో నటించేదాన్ని. చదువు అయ్యాక సివిల్స్ కి ప్రైవెట్ర్ అంతు నాకు నటిని కావాలనే కోరిక ఉండటంతో హైదరాబాద్ వచ్చి థియేటర్స్ వర్క్ షాప్స్ చేశాను. ఈ సినిమా ఆడిషన్స్ కి రాగా నిజాం భార్య పాత్రకి నేను సరిపోతానని భావించి అవకాశం ఇచ్చారు.

ఈ పాత్ర చేయడం ఎలా అనిపించింది?

రజాకార్ సినిమాలో నిజాం భార్యగా కనిపించాను. అది సున్నితంగా ఉంటూనే బలంగా ఉండే పాత్ర. ఈ సినిమాలో ఉండే ఏకైక గ్లామర్ రోల్ నాదే. ఇలాంటి ఒక చరిత్ర చెప్పే సినిమాతో నా కెరీర్ ప్రారంభం అవ్వడం నాకు సంతోషంగా ఉంది. ఈ పాత్ర కోసం మెథడ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. మకరంద్ దేశ్ పాండే గారితో నా లుక్ టెస్ట్ చేసి ఓకే అనుకున్నాకే నాకు అవకాశం ఇచ్చారు.

‘ర‌జాకార్’ సినిమా విజయం ఎలా అనిపిస్తుంది ?

‘ర‌జాకార్’ ఈ నేల కథ. సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇస్తుంది. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు ఎమోషనల్ అవుతున్నారు. ప్రేక్షకుల కళ్ళలో దేశభక్తి కనిపిస్తుంది. ఇలాంటి సినిమాలో భాగం కావడం ఆనందంగా అనిపించింది.

Also Read : Gangs of Godavari : విశ్వక్ సేన్ సినిమా మళ్ళీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్.. ఎన్నికలు అయ్యాకే రిలీజ్..

మీ కుటుంబం నేపధ్యం, నటనపై ఆసక్తి ఎప్పుడు వచ్చింది ?

నాన్న సిఏ, అమ్మ గృహిణి. ఓ పక్క చదువుకుంటూనే మోడలింగ్ కెరీర్ మొదలుపెట్టాను. 2018లో చత్తీస్ ఘడ్ నుంచి మిస్ ఇండియా పోటిల్లో కూడా పాల్గొన్నాను. మా అమ్మ కూడా గతంలో మోడలింగ్ చేసారు. అమ్మ నుంచే మోడలింగ్ పై ఆసక్తి ఏర్పడి ఆ తర్వాత నటన వైపు వచ్చాను.

మీకు ఇష్టమైన హీరో, హీరోయిన్స్ ?

బాలీవుడ్ లో రణబీర్ కపూర్, ఇక్కడ రామ్ చరణ్ ల నటన అంటే చాలా ఇష్టం. రామ్ చరణ్ గారిలో ఇంటెన్స్ ఎమోషన్ ఇష్టపడతాను. హీరోయిన్స్ లో ప్రియాంక చోప్రా, అనుష్క శెట్టి, కీర్తి సురేష్ ఇష్టం. మహానటిలో కీర్తి గారి నటన అద్భుతం. భవిష్యత్ లో అలాంటి మంచి పాత్రలో కనిపించాలని ఎదురుచూస్తున్నాను.