Razakar : రజకర్ సినిమా పోస్టర్ రిలీజ్.. ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ గవర్నర్, ఎంపీలు..
1947 ముందు తెలంగాణ గడ్డ పై రజాకార్ల దురగాథల పై తెరకెక్కుతున్న సినిమా 'రజకర్'. ఈ మూవీ పోస్టర్ లాంచ్ ఈవెంట్ ఈవెంట్ హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద గ్రాండ్ గా జరిగింది.

Razakar movie poster released by Bandi Sanjay Kumar
Razakar : స్వాతంత్ర పోరాటాలు, ఉద్యమ పోరాటాలు పై ఎన్ని సినిమాలు వచ్చినా.. ఆ కథలు ఆడియన్స్ కి ఒక కొత్త అనుభూతిని ఇస్తూనే ఉంటాయి. చరిత్రలో ఉన్న ఏదో ఒక కథని ఇప్పటి వారికి తెలియజేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ‘రజకర్’ అనే సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. 1947 ముందు తెలంగాణ గడ్డ పై రజాకార్ల దురగాథల వల్ల సాధారణ ప్రజలు ఎన్నో కష్టాలు, బాధలు పడ్డారు. వాటిని హితివృత్తాంతంగా రూపొందించి రచకర్ సినిమా ద్వారా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.
ఈ మూవీ పోస్టర్ లాంచ్ ఈవెంట్ ఈవెంట్ హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి సినీ ప్రముఖులతో పాటు ముఖ్య అతిథులుగా మాజీ గవర్నర్ విద్యసాగర్, ఎంపీ బండి సంజయ్, మాజీ ఎంపీలు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జితేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ మూవీని బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకి ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ పాటలు రాస్తున్నారు.
Baby Movie : బేబీ మూవీ పై దర్శకుడు బీవీఎస్ రవి వైరల్ ట్వీట్.. మీరు ఇడియట్స్, దురదృష్టవంతులు..!
సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ.. “రజకర్ లాంటి సినిమా తియ్యాలంటే చాలా గడ్స్ ఉండాలి. మా అమ్మ నాన్న ఇద్దరు స్వతంత్ర సమరయోధులే. వారి బిడ్డగా నాకు ఈ సినిమాలో పాటలు రాయడం అదృష్టంగా భావిస్తున్నా. రజకర్ అంటే కార్యకర్త వలంటీర్ అనే అర్థం వస్తుంది. కానీ రజకర్ చేసిన దూరగతలు అంతా ఇంతా కాదు. ఇది మతపరమైన సినిమా కాదు. ఏ ఒక్కరికి ఇది వెతిరేకమైనది కాదు” అంటూ వ్యాఖ్యానించారు.