National Cinema Day: నేషనల్ సినిమా డే.. థియేటర్లకు ఎగబడ్డ జనం!
‘నేషనల్ సినిమా డే’ను ఇండియాలో ప్రతియేటా సెప్టెంబర్ 23న జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈయేడు కూడా ‘నేషనల్ సినిమా డే’ సందర్భంగా మూవీ లవర్స్‌కు అదిరిపోయే ఆఫర్‌ను ఇచ్చారు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఈ నేషనల్ సినిమా డే రోజున దేశవ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ రేట్లను తగ్గింపు ధరకు అందుబాటులో ఉంచారు.

Record People Watch Films On National Cinema Day In India
National Cinema Day: ‘నేషనల్ సినిమా డే’ను ఇండియాలో ప్రతియేటా సెప్టెంబర్ 23న జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈయేడు కూడా ‘నేషనల్ సినిమా డే’ సందర్భంగా మూవీ లవర్స్‌కు అదిరిపోయే ఆఫర్‌ను ఇచ్చారు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఈ నేషనల్ సినిమా డే రోజున దేశవ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ రేట్లను తగ్గింపు ధరకు అందుబాటులో ఉంచారు.
National Cinema Day: మల్టీప్లెక్స్‌లలో రూ.75 కే సినిమా.. ఎప్పుడంటే?
దీంతో సినిమాను తక్కువ రేటుకు చూసేందుకు జనం థియేటర్లకు ఎగబడ్డారు. కోవిడ్ తరువాత ప్రేక్షకులు థియేటర్లకు తక్కువగా వస్తుండటంతో, వారిని థియేటర్లకు వచ్చేలా చేసేందుకు ఈ నేషనల్ సినిమా డే ఉపయోగపడుతుందని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా భావించింది. ఈ క్రమంలో మల్టీప్లెక్స్‌లో రూ.75 చొప్పున సినిమా టికెట్ రేటును అందుబాటులో ఉంచడంతో, సెప్టెంబర్ 23న దేశవ్యాప్తంగా సినిమాను వీక్షించే పబ్లిక్ సంఖ్య భారీగా పెరిగింది.
బాలీవుడ్ మీడియా ప్రకారం దేశవ్యాప్తంగా శుక్రవారం రోజున సుమారుగా 6.5 మిలియన్ మంది సినిమాను చూసేందుకు థియేటర్లకు వెళ్లారట. ఈ స్థాయిలో థియేటర్లకు జనం రావడం చాలా విశేషమని చెప్పాలి. ఇక ఈ నేషనల్ సినిమా డే సందర్భంగా సినిమా టికెట్ రేట్లు చవకగా దొరకడంతో సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు ఎగబడ్డారని పలువురు కామెంట్ చేస్తున్నారు. దీన్నిబట్టి సినిమా థియేటర్లలో టికెట్ రేట్లు తగ్గిస్తే, జనం సినిమాలు చూసేందుకు ఖచ్చితంగా థియేటర్లకు వస్తారని వారు అంటున్నారు.