Chiranjeevi : రవితేజ కోసం.. ఒకే వేదికపై మెగాస్టార్, రేణు దేశాయ్..

తాజాగా ఓ సినిమా లాంచ్ ఈవెంట్ లో రేణు దేశాయ్, మెగాస్టార్ చిరంజీవి ఎదురు పడ్డారు. ఇప్పుడిప్పుడే రేణు దేశాయ్ సినిమాల్లోకి మళ్ళీ ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే పలు టీవీ షోలు, యాడ్స్ తో.....

Chiranjeevi : రవితేజ కోసం.. ఒకే వేదికపై మెగాస్టార్, రేణు దేశాయ్..

Renu Desai

Updated On : April 2, 2022 / 9:36 PM IST

 

Renudesai :  పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ ఒక్కసారి కూడా మెగా ఫ్యామిలీని కలవలేదు. పిల్లలు మాత్రం రెగ్యులర్ గా మెగా ఫ్యామిలిలో జరిగే అన్ని ఫంక్షన్స్, పండుగలకు వెళ్తూ ఉంటారు. రేణు దేశాయ్ మెగా ఫ్యామిలీకి ఎప్పుడో దూరమయ్యారు. కనీసం ఆ ఫ్యామిలీ వాళ్లకి గత కొన్ని సంవత్సరాలుగా ఎదురుపడలేదు. తాజాగా ఓ సినిమా లాంచ్ ఈవెంట్ లో రేణు దేశాయ్, మెగాస్టార్ చిరంజీవి ఎదురు పడ్డారు.

 

ఇప్పుడిప్పుడే రేణు దేశాయ్ సినిమాల్లోకి మళ్ళీ ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే పలు టీవీ షోలు, యాడ్స్ తో సందడి చేస్తుంది. తాజాగా రవితేజ హీరోగా చేస్తున్న పాన్ ఇండియా సినిమా టైగర్ నాగేశ్వరరావు సినిమా లాంచింగ్ జరిగింది. ఇందులో రేణు దేశాయ్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే ఇవాళ జరిగిన ఈ సినిమా లాంచింగ్ కి చిరంజీవి ముఖ్య అతిధిగా వచ్చారు. ఈ కార్యక్రమానికి రేణు దేశాయ్ కూడా వచ్చారు.

Raviteja : టైగర్ నాగేశ్వరరావు సినిమా లాంచ్

చిరంజీవి లోపలికి వచ్చి అందరికి నమస్కారం పెడుతూ వెళ్తున్నారు. అక్కడే రేణు దేశాయ్ కూడా ఉంది. చిరంజీవి వస్తున్నారని అందరితో పాటే రేణు దేశాయ్ కూడా లేచి నిల్చుంది. చిరు అందరికి నమస్కారం పెట్టుకుంటూ వెళ్లిపోయారు. రేణు దేశాయ్ కూడా నవ్వుతూ ఉంది. అయితే వీరిద్దరూ ప్రత్యేకంగా నమస్కరించుకోవడం, పలకరించడం లాంటిది చేయలేదు. అందరితో పాటే నవ్వుతూ నమస్కారం చేస్తూ చిరు వెళ్లిపోయారు.

BiggBoss Non Stop : బిగ్‌బాస్‌లోకి సుమక్క.. పనిలో పనిగా ప్రమోషన్లు

ఇక కార్యక్రమంలో కూడా చిరంజీవి మాట్లాడి వెళ్లిన తర్వాతే అందరు మాట్లాడారు. రేణు దేశాయ్ కూడా చిరంజీవి వెళ్లాకే మాట్లాడింది. వీరిద్దరూ కూడా రవితేజ కోసమే ఈ ఫంక్షన్ కి వచ్చారు. చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి, రేణు దేశాయ్ ఒకే వేదిక మీద కనపడటంతో ఈ వీడియో వైరల్ అవుతుంది.