Renu Desai : ఆ యూట్యూబ్ ఛానల్ కి కౌంటర్ ఇచ్చిన రేణు దేశాయ్.. వాళ్ళని అసలు నమ్మొద్దు అంటూ..
ఎన్నికల్లో పవన్ గెలుపు తర్వాత అకిరా నందన్ బాగా వైరల్ అయ్యాడు. పవన్ ఎక్కడికి వెళ్లినా తోడు తన కొడుకు అకిరాను తీసుకెళ్లడంతో అకిరా మీద అనేక వార్తలు వచ్చాయి.

Renu Desai Counter on a You tube Channel for Promoting Fake News on Akira Nandan
Renu Desai : పవన్ కి విడాకులు ఇచ్చిన తర్వాత తన పని తాను చేసుకుంటున్నా రేణు దేశాయ్ ఏదో రకంగా వైరల్ అవుతూనే ఉంటుంది. అకిరా, ఆద్యా వల్ల లేదా పవన్ ప్రస్తావన వచ్చినప్పుడు సోషల్ మీడియాలో రేణు దేశాయ్ వైరల్ అవుతూ ఉంటుంది. ఒక్కోసారి ఇలాంటి వాటికీ రేణు దేశాయ్ సీరియస్ గానే స్పందిస్తుంది. పవన్ గురించి మాట్లాడేటప్పుడు నా ప్రస్తావన ఎందుకు అని కౌంటర్లు ఇస్తుంది. సోషల్ మీడియాలో పెట్టే కామెంట్స్ కి కూడా రేణు దేశాయ్ స్పందిస్తూ గట్టిగానే సమాధానాలు ఇస్తుంది.
ఇటీవల ఎన్నికల్లో పవన్ గెలుపు తర్వాత అకిరా నందన్ బాగా వైరల్ అయ్యాడు. పవన్ ఎక్కడికి వెళ్లినా తోడు తన కొడుకు అకిరాను తీసుకెళ్లడంతో అకిరా మీద అనేక వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఓ యూట్యూబ్ ఛానల్ అకిరాకు భారీ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి, షాక్ లో రేణు దేశాయ్ అని ఓ థంబ్ నైల్ పెట్టి వీడియోని అప్లోడ్ చేసారు. ఆ వీడియో లోపల విషయం ఏముందో కానీ థంబ్ నైల్ తో ఆ వీడియో వైరల్ అవ్వడంతో రేణు దేశాయ్ వరకు చేరింది.
Also Read : Tollywood – Chandrababu : చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. గన్నవరంకు తరలివస్తున్న సినీ ప్రముఖులు..
ఓ నెటిజన్ రేణు దేశాయ్ కి ఈ వీడియో ని పంపి ఇది నిజమేనా అని అడగడంతో రేణు దేశాయ్ సమాధానమిస్తూ.. అవన్నీ అబద్దాలు. యూట్యూబ్ లో వచ్చేవి అసలు నమ్మొద్దు అని రిప్లై ఇచ్చింది. దీన్ని స్క్రీన్ షాట్ తీసి రేణు దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసి.. ఈ యూట్యూబ్ వాళ్ళు సినిమా స్క్రిప్ట్స్ రాస్తే మంచిదేమో అని కౌంటర్ ఇచ్చింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. మొత్తానికి మరోసారి రేణు దేశాయ్ వైరల్ గా మారింది.