Renu Desai : పవన్ కళ్యాణ్ ‘బాలు’ సినిమా హీరోయిన్ నాకు నచ్చలేదు..

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'బాలు' సినిమా హీరోయిన్ తనకి నచ్చలేదని రేణూదేశాయ్ వైరల్ కామెంట్స్ చేసింది. ఇంతకీ అసలు అప్పుడు ఏం జరిగింది..?

Renu Desai : పవన్ కళ్యాణ్ ‘బాలు’ సినిమా హీరోయిన్ నాకు నచ్చలేదు..

Renu Desai said she didnt like Pawan Kalyan Balu cinema Heroine

Updated On : October 19, 2023 / 10:45 AM IST

Renu Desai : రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో రేణూదేశాయ్ ఆడియన్స్ ముందుకు మళ్ళీ రాబోతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్న ఈమె.. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో ఆసక్తికర విషయాలను ఆడియన్స్ కి తెలియజేస్తుంది. ఈక్రమంలోనే తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో.. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘బాలు’ సినిమా హీరోయిన్ తనకి నచ్చలేదని వైరల్ కామెంట్స్ చేసింది. ఇంతకీ అసలు అప్పుడు ఏం జరిగింది..?

కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాలు’ సినిమా 2005 లో రిలీజ్ అయ్యింది. ఆ సినిమాలో హీరోయిన్స్ గా శ్రియా శరన్, నేహా ఒబెరాయ్ నటించారు. అయితే వీరిలో నేహా.. రేణూదేశాయ్ కి నచ్చలేదట. ఈ విషయం గురించి ఆమె చెబుతూ.. “కరుణాకరన్ నాతో చాలా క్లోజ్ గా ఉంటాడు. అక్క అక్క అంటుంటాడు. ఈ క్లోజ్‌నెస్‌తో ఆ మూవీ సమయంలో హీరోయిన్ విషయం గురించి కూడా మాట్లాడుతూ.. అక్క ఆ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ లా ఉంటుందని చెప్పాడు. అయితే ఫోటో చూపించిన తరువాత నాకు అంత అనిపించలేదు. హీరోయిన్ బాగానే ఉంది గాని ఐశ్వర్య అంత లేదని చెప్పాను” అంటూ పేర్కొంది.

Also read : Renu Desai : జనసేన కోసం రేణూదేశాయ్ పని చేయబోతుందా..?

తన అభిప్రాయం మాత్రమే చెప్పింది తప్ప ఆ హీరోయిన్ గురించి తప్పుగా మాట్లాడడం, లేదా సినిమాలోకి తీసుకో వద్దు అని అసలు చెప్పలేదట. అయితే ఈ విషయం బయటకి వేరేలా వచ్చిందట. హీరోయిన్ విషయంలో రేణూదేశాయ్ అసంతృప్తి వ్యక్తం చేసిందని, ఆమెకు ఆ హీరోయిన్ అంటే ఇష్టం లేదని వార్తలు వచ్చని ఆమె పేర్కొంది. కాగా ఆ సినిమాకి రేణూదేశాయ్ కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసింది. అంతేకాదు మూవీలోని ‘హట్ హట్‌జ’ సాంగ్ కి ఎడిటర్ గా కూడా వర్క్ చేసింది. మూవీలో ఈ రెండు విషయాలకు ఆడియన్స్ నుంచి మంచి మార్కులే పడ్డాయి.