Aadya – Akira : ఆద్యతో క్యూట్ ఫోటో షేర్ చేసిన రేణు దేశాయ్.. కొడుకు అకిరా ఫోటో కూడా షేర్ చేసి..
తాజాగా మరోసారి రేణు దేశాయ్ ఆద్య, అకిరా ఫోటోలు షేర్ చేసింది.

Renu Desai Shares Cute Photos with Aadya and Shares Akira Nandan Photo
Aadya – Akira : రేణు దేశాయ్ రెగ్యులర్ గా ఇటీవల తన పిల్లల గురించి ఏదో ఒకటి పోస్ట్ చేస్తూనే ఉంది. ఇక పవన్ ఎన్నికల్లో గెలిచిన దగ్గర్నుంచి ఆద్య, అకిరాలు రెగ్యులర్ గా కనపడటం, వారి ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి రేణు దేశాయ్ ఆద్య, అకిరా ఫోటోలు షేర్ చేసింది.
ఆద్యతో బయటకు వెళ్ళినప్పుడు దిగిన క్యూట్ ఫోటోను రేణు దేశాయ్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే అకిరా జపనీస్ రైటర్ హరుకి మురకమి బుక్స్ చదువుతుండగా ఫేస్ కనపడకుండా ఫొటోస్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అకిరా చదువుతున్న ఫోటో షేర్ చేసి.. ఆ రైటర్ బుక్స్ గురించి, రాబోయే బుక్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టు చెప్పింది. దీంతో రేణు దేశాయ్ చేసిన పోస్టులు వైరల్ గా మారాయి.