సుప్రీం హీరో కూడా వచ్చేస్తున్నాడు..

సుప్రీం హీరో కూడా వచ్చేస్తున్నాడు..

Updated On : February 1, 2021 / 8:08 PM IST

Republic Movie: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, లాక్‌డౌన్ తర్వాత ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు మరో సినిమా విడుదల తేదీ ఫిక్స్ చేసేశాడు. దేవ కట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘రిపబ్లిక్’..

ఐశ్వర్యా రాజేష్ కథానాయిక.. దేవ కట్టా కొంత గ్యాప్ తర్వాత చేస్తున్న ఈ చిత్రాన్ని జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, జీ స్టూడియోస్ బ్యానర్లపై సీనియర్ నిర్మాతలు భగవాన్, పుల్లారావు నిర్మిస్తున్నారు.

Republic

రిపబ్లిక్ డే సందర్భంగా ‘రిపబ్లిక్ ఇన్ టు పబ్లిక్’ అంటూ రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. దర్శకుడు దేవ కట్టా రిపబ్లిక్ గురించి రాసిన పదునైన సంభాషణలు, మెలోడీ బ్రహ్మ మణి శర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి.

సోమవారం ‘రిపబ్లిక్’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. జూన్ 4న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. ‘ప్రస్థానం’, ‘ఆటోనగర్ సూర్య’ వంటి చిత్రాలతో రచయితగా, దర్శకుడిగా తన ప్రత్యేకత చాటుకున్న దేవ కట్టా ‘రిపబ్లిక్’ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు.