Raghavendrarao : నటుడిగా నా ఫస్ట్ చెక్ ని దాచుకున్నా: రాఘవేంద్రరావు
ఈ సినిమాతో నటుడిగా మారుతున్నారు. ఇటీవల జరిగిన ‘పెళ్లి సందD’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. తన అన్నయ్య కృష్ణమోహన్‌తో ఉన్న రిలేషన్ గుర్తుకు తెచ్చుకుని

Raghavendrarao
Raghavendrarao : 100కి పైగా సినిమాలకి దర్శకత్వం వహించిన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గత కొన్నేళ్లుగా సినిమాలకి దూరంగా ఉన్నారు. తాజాగా ఇప్పుడు ‘పెళ్లి సందD’ సినిమాతో మళ్ళీ రాబోతున్నారు. అయితే ఈ సారి దర్శకుడిగా కాదు నటుడిగా. 25 సంవత్సరాల క్రితం రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా వచ్చిన సినిమా ‘పెళ్లిసందడి’. ఈ సినిమా భారీ విజయం సాధించింది. పాతికేళ్ల తర్వాత ఇప్పుడు శ్రీకాంత తనయుడు రోషన్ హీరోగా మరో ‘పెళ్లి సందD’ తో రాబోతున్నారు. ఈ సినిమాకి రాఘవేంద్ర రావు శిష్యురాలు గౌరి రోణంకి దర్శకత్వం వహించగా ఆయన దర్శకత్వ పర్యవేక్షణ చేశారు.
RGV : గండి మైసమ్మ అమ్మవారికి మందు తాగించిన ఆర్జీవీ
ఈ సినిమాలో ఒక ముఖ్యపాత్రలో కనిపించబోతున్నారు రాఘవేంద్రరావు. ఈ సినిమాతో నటుడిగా మారుతున్నారు. ఇటీవల జరిగిన ‘పెళ్లి సందD’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. తన అన్నయ్య కృష్ణమోహన్‌తో ఉన్న రిలేషన్ గుర్తుకు తెచ్చుకుని ఎమోషనల్ అయ్యారు. అన్నయ్య కృష్ణ మోహన్ సమర్పణలో ‘పెళ్లి సందD’ చేయాలనుకున్నప్పుడు అన్నయ్య దగ్గరకు వెళ్లి.. ‘నేను తొలిసారిగా నటిస్తున్నాను. ‘పెళ్లి సందD’ సినిమాకి మీరే కదా నిర్మాత నాకు రెమ్యునరేషన్ ఇవ్వండి’ అని అడిగాను. అన్నయ్య చెక్ రాసి ఇచ్చారు. కానీ కరోనా కారణంగా సినిమా అనుకున్న సమయంలో విడుదల కాలేదు. విడుదలయ్యేలోపు అన్నయ్య కృష్ణమోహన్‌రావు చనిపోయారు. అన్నయ్య మీదున్న ప్రేమ, అభిమానంతో ఆయన ఇచ్చిన చెక్‌ను మార్చుకోకుండా నా దగ్గరే ఉంచుకున్నాను అని అన్నారు. ‘పెళ్లి సందD’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆ చెక్‌ను చూపించి ఎమోషనల్ అయ్యారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.