RGV : ‘ఆర్ఆర్ఆర్’ టికెట్ ధర అక్కడ 2200.. ఏపీలో 200 కూడా లేదు..

తాజాగా ఆర్జీవీ ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి 'ఆర్ఆర్ఆర్' సినిమా టికెట్ రేట్లపై ట్వీట్ చేశారు. ఆర్జీవీ.. ''మహారాష్ట్ర ప్రభుత్వం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకు టికెట్ రేటు రూ.2,200..........

RGV : ‘ఆర్ఆర్ఆర్’ టికెట్ ధర అక్కడ 2200.. ఏపీలో 200 కూడా లేదు..

Rrr Rgv

Updated On : January 11, 2022 / 6:43 PM IST

RGV :   ఏపీలో సినిమా టికెట్‌ ధరల తగ్గింపుపై ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో ఆర్జీవీ కూడా ఇన్వాల్వ్ అయి ఈ అంశం పై మరింత చర్చకి తెర లేపారు. ఇటీవల ఏపీ సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని నానితో ఆర్జీవీ భేటీ అయ్యారు. ఈ సమస్యకి పరిష్కారం తెస్తారని అంతా భావించారు. కానీ నానితో భేటీ తర్వాత కూడా ఆర్జీవీ ట్విట్టర్ లో మళ్ళీ సినిమా సమస్యలపై పోస్టులు చేస్తూనే ఉన్నారు. తాజాగా మళ్ళీ ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.

Rajashekar : రియల్ తండ్రి కూతుళ్లు.. రీల్‌లో కూడా

తాజాగా ఆర్జీవీ ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా టికెట్ రేట్లపై ట్వీట్ చేశారు. ఆర్జీవీ.. ”మహారాష్ట్ర ప్రభుత్వం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకు టికెట్ రేటు రూ.2,200 అనుమతించిందని, ఆ సినిమా తీసిన రాజమౌళి సొంత రాష్ట్రం ఏపీలో మాత్రం రూ.200 అమ్ముకోవడానికి అనుమతుల్లేవా అని ప్రశ్నించారు. ఇది చూస్తుంటే బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ప్రశ్న ఏపీలో వినిపిస్తోందని” ట్వీట్ చేశారు. అలాగే ఉత్తరాది రాష్ట్రాల్లో ఐనాక్స్ లో ‘ఆర్ఆర్ఆర్’ టికెట్ 2200 వరకు కూడా ఉందని ట్వీట్ చేశారు. మళ్ళీ సినిమా సమస్యలపై ఆర్జీవీ వరుస ట్వీట్స్ చేస్తుండటంతో నిన్నటి మీటింగ్ వర్క్ అవుట్ అవ్వలేదని తెలుస్తుంది.