తేడావస్తే తాటతీస్తాడు : వర్మ బయోపిక్ టైగర్ కేసీఆర్

రాంగోపాల్ వర్మ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ తో మళ్లీ జూలు విదిల్చాడా లేడా అన్నది పక్కనపెడితే.. బీభత్సమైన మైలేజీ మాత్రం వచ్చేసింది.

  • Published By: sekhar ,Published On : April 18, 2019 / 09:35 AM IST
తేడావస్తే తాటతీస్తాడు : వర్మ బయోపిక్ టైగర్ కేసీఆర్

Updated On : April 18, 2019 / 9:35 AM IST

రాంగోపాల్ వర్మ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ తో మళ్లీ జూలు విదిల్చాడా లేడా అన్నది పక్కనపెడితే.. బీభత్సమైన మైలేజీ మాత్రం వచ్చేసింది.

రాంగోపాల్ వర్మ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ తో మళ్లీ జూలు విదిల్చాడా లేడా అన్నది పక్కనపెడితే.. బీభత్సమైన మైలేజీ మాత్రం వచ్చేసింది. కాంట్రవర్సీలతోనే సగం సక్సెస్ కొట్టేసే వర్మ.. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ పై పడ్డాడు. ఆయన బయోపిక్ తీయబోతున్నట్లు అనౌన్స్ చేశాడు. పేరు కూడా పెట్టేశాడండోయ్.. టైగర్ కేసీఆర్. ది అగ్రెసివ్ గాంధీ అనే సబ్ టైటిల్‌తో డిజైన్ చేసన లోగోను పోస్ట్ చేశాడు. ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు అనే డైలాగ్ కూడా ఇచ్చాడు. 
Also Read : జీవీఎల్ పై చెప్పుతో దాడి : ప్రెస్ మీట్ షాక్

వర్మ టైటిల్ దగ్గర నుంచి.. ఎంత కూల్‌గా, ఎవరినీ నొప్పించకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడో స్పష్టం అవుతుంది. ఇక ది అగ్రెసివ్ గాంధీ అంటూ గాంధీకి ఆవేశమొస్తే ఎలా ఉంటుందో.. కేసీఆర్ కూడా అలాగే అంటూ గాంధీతో పోల్చి మహానుభావుడిని చేశాడు వర్మ.

ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తాట తీస్తాడనే భయమో ఏమో కానీ.. కెసీఆర్ బయోపిక్ వివరాలను చాలా పద్దతిగా ప్రకటించాడు. కేసీఆర్ బయోపిక్‌లో కూడా చంద్రబాబు పాత్ర, ఎన్టీఆర్ వెన్నుపోటు వంటి అంశాలు ఉంటాయా, ఉండవా అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు ఆర్జీవీ.