కేఏ పాల్ మీద ఒట్టు.. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సందేశాత్మక సినిమా

  • Published By: vamsi ,Published On : October 28, 2019 / 11:20 AM IST
కేఏ పాల్ మీద ఒట్టు..  కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సందేశాత్మక సినిమా

Updated On : October 28, 2019 / 11:20 AM IST

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు.. సినిమాపై వస్తున్న కాంట్రవర్శిలపై దర్శకులు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. 10టీవీ ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడిన వర్మ.. సినిమా ఎవరి కోసమో ఎవరినో డీగ్రేడ్ చేయాలని తీసిన సినిమా కాదు అన్నారు. ఈ సినిమాలో రియల్ లైఫ్ క్యారెక్టర్లు లేవని వెల్లడించారు డైరెక్టర్.

కేఏ పాల్ మీద ఒట్టు వేసి మరీ చెబుతున్నాను.. సినిమా పూర్తిగా సందేశాత్మకంగా ఉంటుందని భరోసా ఇచ్చారాయన. ఇది యదార్ధ కల్పిత ఊహాచిత్రం అని పదేపదే స్పష్టం చేశారు వర్మ. ఎవరికీ సినిమాతో సంబంధం లేదు వెల్లడించారాయన. ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు, నమ్మదగిన కొంత ఊహా.. కొంత నిజం కలగలిపి సినిమా తీస్తున్నట్లు చెప్పారు వర్మ.

సినిమా చూసిన తర్వాత ఎవరైనా భుజాలు తముడుకోవచ్చు అని, ఎవరినైనా పోలినట్లు ఉంటే అది యాదృచ్చికం మాత్రమే ప్రకటించారు వర్మ. క్యాస్ట్ ఫీలింగ్ ఉండకూడదు అని తీసిన సందేశాత్మక చిత్రం ఇది తెలిపారాయన. అయితే.. ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలకు పోలికలు కనిపిస్తాయని, అయితే అది యాదృచ్చికం మాత్రమే అని అన్నారు. అన్ని కులాలు, అన్ని మతాలు సామరస్యంగా ఉండాలనే మెసేజ్‌తో నిజాయితీగా తీసిన సినిమా ఇది అని స్పష్టం చేశారు వర్మ.