Vyuham : ఆర్జీవీ వ్యూహం కథ ఇదే.. వ్యూహం తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వరకు పొలిటికల్ సినిమాలు తీయను.. ఆర్జీవీ వ్యాఖ్యలు..

ఇటీవల జగన్ కి సంబంధించిన కథతో వ్యూహం అనే సినిమాను తీస్తాను అని, రెండు పార్టులుగా తీసి ఎలక్షన్స్ టైంకి రిలీజ్ చేస్తానని ప్రకటించారు ఆర్జీవీ. తాజాగా ఆర్జీవీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి మాట్లాడారు.

Vyuham : ఆర్జీవీ వ్యూహం కథ ఇదే.. వ్యూహం తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వరకు పొలిటికల్ సినిమాలు తీయను.. ఆర్జీవీ వ్యాఖ్యలు..

RGV spokes about Vyuham movie story and releasing

Updated On : June 13, 2023 / 9:26 AM IST

RGV Vyuham Movie : సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ(Rgv) గురించి అందరికి తెలిసిందే. ఒకప్పుడు టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) లో సూపర్ హిట్ సినిమాలు అందించిన ఆర్జీవీ గత కొన్నాళ్ల నుంచి మాత్రం నా ఇష్టం అంటూ ఏవేవో సినిమాలు చేస్తున్నాడు. అయినా కూడా ఆయన క్రేజ్ తగ్గలేదు. ఆర్జీవీ ముందు నుంచి కూడా ఏపీ సీఎం జగన్ కు సపోర్ట్ గానే మాట్లాడుతున్నాడు. గతంలో ఎలక్షన్స్ సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా తీసి సంచలనం సృష్టించారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ టైంకి మరో పొలిటికల్ సినిమాతో రాబోతున్నాడు.

ఇటీవల జగన్ కి సంబంధించిన కథతో వ్యూహం అనే సినిమాను తీస్తాను అని, రెండు పార్టులుగా తీసి ఎలక్షన్స్ టైంకి రిలీజ్ చేస్తానని ప్రకటించారు ఆర్జీవీ. ఈ సినిమాకు జగన్ పార్టీకి చెందిన వ్యక్తులే నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారని సమాచారం. తాజాగా ఆర్జీవీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి మాట్లాడారు.

ఆర్జీవీ మాట్లాడుతూ.. నా కెరీర్ లో రాజకీయ సినిమాలు కేవలం సర్కార్, లక్ష్మీస్ ఎన్టీఆర్ మాత్రమే చేశాను. ఇప్పుడు వ్యూహం తీస్తున్నాను. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలు కేవలం ఎలక్షన్స్ సమయంలోనే సేల్ అవుతాయి. అందుకే వ్యూహం సినిమా రిలీజ్ తర్వాత మళ్ళీ అయిదేళ్ల వరకు పొలిటికల్ సినిమాలు తీయను. వ్యూహం సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ అవుతుంది. వ్యూహం 2 సినిమా 2024 ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుంది అని తెలిపారు.

ఇక వ్యూహం సినిమా కథ గురించి చెప్తూ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం అంటే నాకు చాలా ఇష్టం. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయాక జగన్ ని తొక్కేయాలనుకున్నారు. కొందరు కుట్రలు చేశారు. జగన్ జీవితంలో 2009 నుంచి 2014 వరకు ఏం జరిగింది? ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది వ్యూహం మొదటి పార్ట్ లోచూపిస్తాను. ఈ సినిమాకు మొదట కుట్ర అనే టైటిల్ అనుకున్నాను కానీ చీప్ గా ఉంటుందని తర్వాత వ్యూహంగా మార్చాను. వ్యూహం 2 లో జగన్ సీఎం అయిన తర్వాత జరిగిన అంశాల గురించి, జగన్ పర్సనల్ లైఫ్ గురించి ఉంటుంది అని తెలిపారు ఆర్జీవీ.

Khatija Rahman : మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వనున్న రెహమాన్ కూతురు..

గత ఎలక్షన్స్ సమయంలో ఆర్జీవీ చేసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా లాగే ఈ వ్యూహం సినిమాలు కూడా క్లిక్ అవుతాయా? ఎలక్షన్స్ సమయంలో జగన్ కి ఇవి పని చేస్తాయా చూడాలి. ఇటీవల వ్యూహం సినిమా గురించి ఆర్జీవీ వరుస పోస్టులు పెడుతుండటంతో ఏపీ రాజకీయాల్లో ఈ సినిమా చర్చగా మారింది.