దిష్టి బొమ్మ అంటూ బాలయ్యతో రోజా ఫోటోపై వర్మ మార్క్ ట్రోలింగ్!

  • Published By: vamsi ,Published On : January 23, 2020 / 02:04 AM IST
దిష్టి బొమ్మ అంటూ బాలయ్యతో రోజా ఫోటోపై వర్మ మార్క్ ట్రోలింగ్!

Updated On : January 23, 2020 / 2:04 AM IST

వివాదాలకు కేరాఫ్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలా? ఏదో ఒక్క కాంట్రవర్శీతో ఎప్పుడు వార్తల్లో నిలవాలని అనుకునే వర్మ.. చంద్రబాబును టార్గెట్ చేస్తూ.. లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు వంటి సినిమాలతో హడావుడి చేశారు. అయితే ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో కొంతకాలంగా కాంట్రవర్శీలకు దూరంగా ఉంటున్నారు.

అయితే మరోసారి వర్మ తన మార్క్ ట్రోలింగ్‌తో సినీ నటుడు నందమూరి బాలకృష్ణని ఉద్ధేశిస్తూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అభివృద్ది వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దుపై శాసనమండలిలో చర్చ జరుగుతున్న వేళ.. వైసీపీ ఎమ్మెల్యే రోజా, ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు.. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణతో నవ్వుతూ సెల్ఫీలు దిగడం హాట్ టాపిక్‌ అయ్యింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. వర్మ తన మార్క్ ట్రోలింగ్ ట్విట్టర్‌లో ఫోటోలను ఉద్ధేశిస్తూ చేశారు. 

ఇంతకుముందు పవన్ కళ్యాణ్.. చిరంజీవితో సహా మెగా హీరోలను ట్రోల్ చేసిన వర్మ.. బాలకృష్ణను ట్రోల్ చేశారు.  సినిమాలు, రాజకీయాలపై తనదైన శైలిలో ట్రోలింగ్స్ చేసే వర్మ.. రోజా-బాలకృష్ణల సెల్ఫీని పెట్టి రోజా అందంగా ఉందంటూ పొగిడారు. అంతటితో ఆగిపోలేదు. బాలకృష్ణను దిష్టిబొమ్మ అంటూ ట్రోల్ చేశాడు. ‘సెల్ఫీలో రోజా గారు హీరోలా కనిపిస్తున్నారు.

కానీ ఆమె కుడి పక్కన ఉన్న వ్యక్తి ఎవరో గానీ అసహ్యంగా ఉన్నాడు. ఈ ఫ్రేమ్‌లో అతను రోజా గారి అందాన్ని పాడుచేస్తున్నాడు.. లేదా అతను ఆమెకు దిష్టి బొమ్మ కావచ్చు..’ అంటూ వర్మ ఘాటుగా ట్రోల్ చేశారు. అంతేకాదు, ట్వీట్‌లో ‘అందమైన రోజా గారి పక్కన కూర్చుని.. ఆ ఫోటోను నాశనం చేసిన ఈ వ్యక్తి ఎవరో మీరు చెప్పగలరా..?’ అంటూ మరో ట్వీట్ కూడా వేశారు. ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్లపై బాలయ్య అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.