ఎవర్నీ వదలడు : లక్ష్మీస్ ఎన్టీఆర్ లోకి మోడీని లాగిన వర్మ

చంద్రబాబు ఎన్టీఆర్‌ను గద్దె దించి ముఖ్యమంత్రి అయిన కథను తీసుకుని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా లక్ష్మీ’స్ ఎన్‌టీఆర్. ఈ సినిమాలో రంగస్థల నటుడు విజయ్ కుమార్ ఎన్‌టీఆర్ పాత్రలో నటిస్తుండగా.. యగ్నా శెట్టి లక్ష్మీ పార్వతి పాత్రలో నటిస్తున్నారు. కల్యాణీ మాలిక్ సంగీతం అందించిన ఈ సినిమా మార్చి 22వ తేదీ విడుదలకు సిద్ధం అవుతుండగా.. సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలను వేగంగా జరుపుతున్నారు రామ్ గోపాల్ వర్మ. ఇప్పటికే ప్రచార చిత్రాలను, ట్రైలర్‌లను విడుదల చేసిన వర్మ.. ప్రమోషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ వీడియో ప్రోమోను విడుదల చేశాడు వర్మ.
Read Also : వైసీపీ మమ్మల్ని నిలువునా ముంచేసింది : తిప్పారెడ్డి భార్య
‘ఎన్‌టీఆర్ స్వయంగా చంద్రబాబు తనను ఎలా వెన్నుపోటు పొడిచారో చెప్పాడు’ అంటూ దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన పుస్తకం ఆధారంగా అప్పటి ఎన్‌టీఆర్ వ్యాఖ్యలను వీడియో రూపంలో తయారు చేసి రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు.
‘చంద్రబాబు వెన్నుపోటు పొడిచింది నాకు కాదు.. నాకు అధికారం ఇచ్చిన మీకు’ అంటూ ప్రజలతో ఎన్‌టీఆర్ తన ఆవేదనను పంచుకున్న వీడియోని రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. ‘ప్రజాస్వామ్యం బాగుండాలంటే ఎవరికి ఓటేయాలి’ అనే విషయాన్ని ఎన్‌టీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారని వర్మ తన వీడియోలో ఎన్‌టీఆర్ సందేశంగా వినిపించారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చంద్రబాబును ఉద్దేశించి ’నువ్వే మామకు వెన్నుపోటు పొడవటంలో సీనియర్’ అంటూ చేసిన వ్యాఖ్యలను ప్రోమోలో ఉంచారు.
Prime minister @narendramodi talking about how Andhra Pradesh Chief Minister @ncbn Back Stabbed NTR #LakshmisNTR promo pic.twitter.com/aQk7Dcem6B
— Ram Gopal Varma (@RGVzoomin) March 12, 2019