Roja : రీ ఎంట్రీలో అదరగొడుతున్న రోజా.. అప్పుడే జడ్జిగా కామెడీ పంచ్ లు.. ప్రోమో వైరల్..

తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలోనే సుధీర్ మీద పంచ్ లు వేసింది రోజా.

Roja : రీ ఎంట్రీలో అదరగొడుతున్న రోజా.. అప్పుడే జడ్జిగా కామెడీ పంచ్ లు.. ప్రోమో వైరల్..

Roja Comedy Punches on Sudheer in Drama Juniors Show Promo goes Viral

Updated On : April 8, 2025 / 7:46 PM IST

Roja : గతంలో రాజకీయాల వల్ల టీవీ షోల నుంచి తప్పుకున్న రోజా ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. జీ తెలుగులో డ్రామా జూనియర్స్ కొత్త సీజన్ మొదలవ్వగా ఈ షోలో జడ్జిగా ఎంట్రీ ఇచ్చింది. డ్రామా జూనియర్స్ షోకి సుధీర్ యాంకర్ గా చేస్తున్నాడు. రోజాతో పాటు డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ షోకి జడ్జిగా వ్యవహరించబోతున్నట్టు తెలుస్తుంది.

ఇటీవల షో ప్రోమోని రిలీజ్ చేయగా తాజాగా మొదటి ఎపిసోడ్ ప్రోమోని రిలీజ్ చేసారు. మొదటి ఎపిసోడ్ లోనే రోజా గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చేసింది. జబర్దస్త్ లో రోజా ఆర్టిస్టుల మీద బాగా పంచులు వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ షోలో కూడా మొదటి ఎపిసోడ్ లోనే సుధీర్ మీద బాగా పంచ్ లు వేసినట్టు తెలుస్తుంది.

Also Read : Allu Arjun : వామ్మో అల్లు అర్జున్ – అట్లీ సినిమా బడ్జెట్ అంతా..? ఇండియా హైయెస్ట్ రెండో బడ్జెట్ సినిమా.. మొదటిది ఏంటో తెలుసా?

తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలోనే సుధీర్ మీద పంచ్ లు వేసింది రోజా. దీంతో ఈ ప్రోమో చూసి రోజా కామెడీ టైమింగ్ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చింది. ఇకముందు షోలో జడ్జిగా అదరగొడుతుంది అని అంటున్నారు ఫ్యాన్స్. మీరు కూడా రోజా రీ ఎంట్రీ షో ప్రోమో చూసేయండి..

ఇక ఈ షో ఈ శనివారం ఏప్రిల్ 12 నుంచి మొదలు కానుంది. ప్రతి శనివారం కొత్త ఎపిసోడ్ రాత్రి 9 గంటలకు జీ తెలుగు ఛానల్ లో రానుంది.