RRR: ఫైనల్ కాపీ రెడీ.. ‘ఆర్ఆర్ఆర్’ రన్ టైం ఎంతంటే?
ఆర్ఆర్ఆర్.. ఆర్ఆర్ఆర్.. ఆర్ఆర్ఆర్.. ఎక్కడ విన్నా ఇప్పుడు ఇదే నామస్మరణ. ఇండియన్ మోస్ట్ అవెయిటెడ్ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ ఎప్పుడప్పుడు థియేటర్లకు వస్తుందా అని సినిమా ప్రేక్షకులంతా..
RRR: ఆర్ఆర్ఆర్.. ఆర్ఆర్ఆర్.. ఆర్ఆర్ఆర్.. ఎక్కడ విన్నా ఇప్పుడు ఇదే నామస్మరణ. ఇండియన్ మోస్ట్ అవెయిటెడ్ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ ఎప్పుడప్పుడు థియేటర్లకు వస్తుందా అని సినిమా ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టు ఇప్పటికే విడుదలైన పోస్టర్ల నుండి వీడియోల వరకు సినిమా మీద అంచనాలను పెంచేశాయి. దీంతో సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ప్రేక్షకులు అతృతతో ఉన్నారు. సంక్రాంతికి వారం ముందే పండగ తెచ్చేయాలని ఇప్పటికే ఫిక్స్ అయ్యారు.
Bigg Boss 5: ఈవారం నామినేషన్లో ఆరుగురు.. ఏడిపించేసిన బిగ్బాస్!
రిలీజ్ డేట్ వచ్చేయడంతో.. ఆ తేదీ ఎప్పుడొస్తుందా.. ప్రస్తుతం సినిమాకి సంబంధించి ఏం చేస్తున్నారు. డబ్బింగ్ అయిపోయిందా.. రీరికార్డింగ్ పూర్తిచేశారా.. ఎడిటింగ్ ఎంతవరకు వచ్చింది.. ఎడిటింగ్ చేసిన టీం సినిమా గురించి చెప్పిన టాక్ ఏంటి.. సినిమా రషెష్ చూసిన వాళ్ళు ఎవరైనా ఎవరి క్యారెక్టర్ గురించి ఎలా చెప్పారు.. ఇలా ఎన్నో విషయాలను తెలుసుకొనేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. ముఖ్యంగా మెగా-నందమూరి అభిమానులైతే ఒకేసారి ఇద్దరు క్రేజీ హీరోలను ఒకే తెరపై చూసేందుకు చెప్పని ఆతృతలో ఉన్నారు.
Bigg Boss 5: వెక్కి వెక్కి ఏడ్చిన కంటెస్టెంట్లు.. ఒకరి కోసం ఒకరు త్యాగాలు!
కానీ, సినిమాకు సంబంధించి ఒక్కో పని పూర్తయి ఆ క్షణం కూడా వచ్చేందుకు సిద్దమవుతుంది. ఇప్పటికే ఆ మధ్య డబ్బింగ్ పూర్తయినట్లు ప్రకటించగా ఇప్పుడు ఎడిటింగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తుంది. ఈ ప్యాన్ ఇండియా మూవీ 2 గంటల 45 నిమిషాల నిడివి ఉందని తెలుస్తుంది. షూటింగ్ ఫుటేజీ 3 గంటలకు పైగా వచ్చినా ఫైనల్ కాపీని 2 గంటల 45 నిమిషాలకు ట్రిమ్ చేశారనీ ఫిలింనగర్ టాక్. ఇంకాస్త నిడివి తగ్గించాలని ప్రయత్నించినప్పటికీ ఎమోషన్స్ ఫైట్స్, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ సీన్స్ కారణంగా 2 గంటల 45 నిమిషాలకు లాక్ చేశారని తెలుస్తుంది.