RRR For Oscars: ఆర్ఆర్ఆర్ ఫర్ ఆస్కార్స్.. ట్రెండింగ్‌కు కారణమిదే!

స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఆస్కార్ అవార్డులకు నామినేట్ అవుతుందంటూ గతకొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతోంది. అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ ఫర్ ఆస్కార్స్ అనే హ్యాష్ ట్యాగ్ మరోసారి ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.

RRR For Oscars: ఆర్ఆర్ఆర్ ఫర్ ఆస్కార్స్.. ట్రెండింగ్‌కు కారణమిదే!

RRR For Oscars Trending In Twitter

Updated On : September 19, 2022 / 6:18 PM IST

RRR For Oscars: టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాతో మరోసారి తన సత్తా ఏమిటో యావత్ ప్రపంచానికి చాటి చెప్పాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంటి ఇద్దరు మేటి నటులను ఆయన హ్యాండిల్ చేసిన తీరు అద్భుతంగా ఉండటంతో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది. ఇక వసూళ్ల వర్షం కురిపించిన ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.

RRR In Oscars: ఒకటి కాదు రెండు కాదు.. ఐదు విభాగాల్లో ఆస్కార్ బరిలో నిలవనున్న ఆర్ఆర్ఆర్..?

అయితే ఈ సినిమా గతకొద్ది రోజులుగా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ వస్తోంది. ఇప్పటికే డిజిటల్ ప్లాట్‌ఫాంలో అందుబాటులో ఉన్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. కాగా, ఈ సినిమా ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల బరిలో భారత్ తరఫున ఎంట్రీ ఇవ్వనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. అయితే తాజాగా మరోసారి ఆర్ఆర్ఆర్ ఫర్ ఆస్కార్స్ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. దీనికి బలమైన కారణం కూడా ఉండటంతో నెటిజన్లు ఈ సినిమాను ట్రెండింగ్ చేస్తున్నారు.

RRR In Saturn Awards: అమెరికా అవార్డుల్లో అదరగొట్టిన ‘ఆర్ఆర్ఆర్’.. ఏకంగా మూడింట్లో..!

ఈ వారంలో భారత్ తరఫున ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయ్యే సినిమాను అఫీషియల్‌గా భారత ప్రభుత్వం అనౌన్స్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అందుకే ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచేందుకే నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు. మరి నిజంగానే ఆస్కార్ అవార్డుల బరిలో ఆర్ఆర్ఆర్ నిలుస్తుందా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, అజయ్ దేవ్గన్, ఒలివియా మారిస్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించగా, కీరవాణి సంగీతం అందించారు.