ఆర్ఆర్ఆర్ : 5 కేటగిరీలో ఇంటర్నేషనల్ అవార్డ్స్‌కి RRR ఎంపిక..

ఒక భారతీయ సినిమా ఆంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చూపించి దుమ్ము దులుపుతుంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' సినిమా వరుసగా ఇంటర్నేషనల్ అవార్డ్స్ అందుకుంటూ భారతీయ సినీ పరిశ్రమని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. తాజాగా..

ఆర్ఆర్ఆర్ : 5 కేటగిరీలో ఇంటర్నేషనల్ అవార్డ్స్‌కి RRR ఎంపిక..

RRR Nominated for International Awards in 5 Category

Updated On : December 15, 2022 / 9:48 AM IST

ఆర్ఆర్ఆర్ : ఒక భారతీయ సినిమా ఆంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చూపించి దుమ్ము దులుపుతుంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వరుసగా ఇంటర్నేషనల్ అవార్డ్స్ అందుకుంటూ భారతీయ సినీ పరిశ్రమని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం.. తాజాగా మరో అంతర్జాతీయ అవార్డులకు ఎంపిక అయింది.

RRR : 24 ఏళ్ళ రజిని రికార్డుని బ్రేక్ చేసిన రాజమౌళి..

లాస్ ఏంజెల్స్ లో నిర్వహించే ‘క్రిటిక్స్ ఛాయస్ అవార్డ్స్’కి ఈ సినిమా మొత్తం 5 కేటగిరీలో ఎంపిక అయ్యింది. బెస్ట్ పిక్చర్, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్, బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ సాంగ్ కేటగిరీల్లో నామినేషన్ లో నిలిచింది RRR సినిమా. మరి ఈ నామినేషన్ లో ఏ అవార్డుని ఈ చిత్రం కైవసం చేసుకుంటుందో చూడాలి. ఇప్పటికే ఈ చిత్రం 5 పైగా ఇంటర్నేషనల్ అవార్డ్స్ ని అందుకుంది.

అయితే రాజమౌళి గురి అంతా ‘ఆస్కార్ అవార్డ్స్’ పైనే ఉంది. ఎలాగైనా ఆస్కార్ నామినేషన్స్ లోకి ఎంట్రీ ఇచ్చి ఒక్క కేటగిరీలో అయినా అవార్డుని అందుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. కాగా ‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్ పై మరోసారి మాట్లాడాడు రాజమౌళి. ఇటీవలే ఒక పాయింట్ అనుకున్నాము, దాని మీద కథ సిద్ధం చేసే పనిలో ఉన్నాము. అంతా బాగా వచ్చింది అనుకున్నప్పుడు మేమే తెలియజేస్తామని వెల్లడించాడు.