వైరల్ అవుతున్న ఆర్ఆర్ఆర్ సెట్ పిక్స్
రీసెంట్‌గా ఆర్ఆర్ఆర్ సెట్‌కి సంబంధించిన పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. బ్రిటీష్ వారి భవనాలు, వాహనాలతో సహా మొత్తం అప్పటి వాతావరణం కళ్ళకు కట్టినట్టు, అద్భుతంగా సెట్స్ డిజైన్ చేస్తున్నారు..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్‌కి ప్రస్తుతం బ్రేక్ ఇచ్చారు. కొద్దిరోజుల క్రితం రామ్ చరణ్ జిమ్‌లో గాయపడడం, తర్వాత ఎన్టీఆర్ చేతికి కూడా ఇంజురీ అవడంతో కొద్ది రోజులు బ్రేక్ తీసుకుంటున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరి ఇంట్రడక్షన్ సీన్స్‌కే దాదాపు రూ.50 కోట్ల భారీ బడ్జెట్ ఖర్చుపెట్టనున్నారు.
రీసెంట్‌గా ఆర్ఆర్ఆర్ సెట్‌కి సంబంధించిన పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్వతంత్రం రాకముందు కాలంలో జరిగే కథ కావడంతో సెట్స్‌ని కూడా ఆకాలానికి తగ్గట్టు రూపొందించారు. బ్రిటీష్ వారి భవనాలు, వాహనాలతో సహా మొత్తం అప్పటి వాతావరణం కళ్ళకు కట్టినట్టు, అద్భుతంగా సెట్స్ డిజైన్ చేస్తున్నారు. అజయ్ దేవ్ గణ్, సముద్రఖని, అలియా భట్ తదితరులు నటిస్తున్న ఆర్ఆర్ఆర్ నెక్స్ట్ షెడ్యూల్ పూణేలో జరగనుంది.