RRR : అమృత్‌సర్ గోల్డెన్ టెంపుల్‌లో ‘ఆర్ఆర్ఆర్’ టీం

ఈ ప్రమోషన్స్ లో భాగంగా దేశంలోని పలు రాష్ట్రాలకు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ లు వెళ్లి సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. నిన్న దేశ రాజధాని ఢిల్లీలో అమీర్ ఖాన్ ముఖ్య అతిధిగా రాగా......

RRR : అమృత్‌సర్ గోల్డెన్ టెంపుల్‌లో ‘ఆర్ఆర్ఆర్’ టీం

Rrr In Amritsar

Updated On : March 21, 2022 / 11:14 AM IST

 

RRR :  రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో రూపొందించిన భారీ మల్టిస్టారర్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. అలియా భట్, అజయ్ దేవగణ్ లాంటి బాలీవుడ్ స్టార్లు కూడా ఈ సినిమాలో నటించారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. అనేక వాయిదాల అనంతరం ఈ సినిమా మార్చ్ 25న రిలీజ్ కానుంది. దీంతో మరోసారి దేశ వ్యాప్తంగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు చిత్ర యూనిట్.

 

ఈ ప్రమోషన్స్ లో భాగంగా దేశంలోని పలు రాష్ట్రాలకు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ లు వెళ్లి సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. నిన్న దేశ రాజధాని ఢిల్లీలో అమీర్ ఖాన్ ముఖ్య అతిధిగా రాగా ప్రమోషనల్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఇవాళ మార్చ్ 21 న ఉదయం పంజాబ్ లోని అమృత్ సర్, సాయంత్రం రాజస్థాన్ లోని జైపూర్ లో ప్రమోషన్స్ కార్యక్రమాలు చేపట్టనున్నారు.

RRR : చెర్రీ, తారక్‌లతో కలిసి నాటు నాటు స్టెప్ వేసిన అమీర్.. వైరల్ అవుతున్న వీడియో..

ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి పంజాబ్ లోని అమృత్‌సర్ చేరుకొని అక్కడి గోల్డెన్ టెంపుల్ ను సందర్శించారు. అక్కడి ప్రముఖులతో సిక్కు సాంప్రదాయాలని పాటిస్తూ గోల్డెన్ టెంపుల్ ని దర్శించుకున్నారు. మరి కొద్దిసేపట్లో ప్రెస్‌మీట్ లో పాల్గొననున్నారు. అమృత్‌సర్ లో ప్రమోషన్స్ అనంతరం రాజస్థాన్ జైపూర్‌కి బయలుదేరనున్నారు.