Ram Pothineni : రామ్ పోతినేని పెళ్లి కుదిరిందా? బిజినెస్ మ్యాన్ కూతురితో వెడ్డింగ్ అంటూ వార్తలు

2023 టాలీవుడ్‌లో పెళ్లి సందడి నడుస్తోంది. బ్యాచిలర్స్ అంతా వరుసగా పెళ్లిళ్లు చేసుకుని ఓ ఇంటివారవుతున్నారు. ఇటీవలే శర్వానంద్ పెళ్లి, వరుణ్ తేజ్ నిశ్చితార్ధ వేడుకలు జరుపుకున్నారు. నెక్ట్స్ రామ్ పోతినేని పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడనే వార్త ఇంటస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

Ram Pothineni  : రామ్ పోతినేని పెళ్లి కుదిరిందా? బిజినెస్ మ్యాన్ కూతురితో వెడ్డింగ్ అంటూ వార్తలు

Ram Pothineni

Ram Pothineni : టాలీవుడ్‌లో బాచులర్స్ అంతా వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇటీవలే శర్వానంద్ పెళ్లి చేసుకోగా.. వరుణ్ తేజ్ జూన్ 9న లావణ్య త్రిపాఠితో నిశ్చితార్ధం చేసుకున్నాడు. ఇక నెక్ట్స్ రామ్ పోతినేని పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

BoyapatiRAPO: రామ్ పోతినేని మూవీపై బోయపాటి అప్డేట్.. ఏమిటో తెలుసా?

టాలీవుడ్ హీరోలంతా వరుసకట్టి పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. ఇటీవల్ రామ్ పోతినేని కజిన్ శర్వానంద్.. రక్షితారెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. జూన్ 4న జైపూర్ లో వీరి వివాహం గ్రాండ్‌గా జరిగింది. కొంతకాలంగా ప్రేమలో ఉన్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీలు కూడా జూన్ 9 న నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక నెక్ట్స్ ఎవరూ అంటే రామ్ గురించి టాక్ వినిపిస్తోంది. గతంలో కూడా అతని పెళ్లి గురించి పుకార్లు వచ్చినా ఈసారి నిజం అనేంతలా ప్రచారం జరుగుతోంది. ఒక బిజినెస్ మ్యాన్ డాటర్‌తో రామ్ పెళ్లి దాదాపుగా ఖాయమైపోయిందని త్వరలోనే అనౌన్స్‌మెంట్ ఉంటుందని అంటున్నారు. ఈ వార్త నిజమైతే రామ్ అభిమానులు సంబరపడిపోవడం ఖాయం.

Ismart Shankar Sequel : ఇస్మార్ట్ సీక్వెల్.. పూరి, రామ్ పోతినేని క్రేజీ కాంబో

రామ్ 2022 లో నటించిన ‘ది వారియర్’ సినిమా సోసో గా ఆడింది. ఈ సినిమా తర్వాత రామ్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ, హిందీ భాషల్లో నిర్మాణం అవుతోంది. ఇంకా కొన్ని కొత్త ప్రాజెక్టులు రామ్ చేతిలో ఉన్నాయి.