కార్తికేయ కొత్త సినిమా- గుణ 369
ఆర్‌ఎక్స్ 100 హీరో కార్తికేయ కొత్త సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్..

ఆర్‌ఎక్స్ 100 హీరో కార్తికేయ కొత్త సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్..
ఆర్‌ఎక్స్ 100 మూవీతో యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో కార్తికేయ వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. బోయపాటి శ్రీను దగ్గర 12 ఏళ్ళ పాటు అసిస్టెంట్‌గా పని చేసిన అర్జున్ జంధ్యాలని దర్శకుడిగా పరిచయం చేస్తూ, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, స్ర్పింట్ టెలీ ఫిలింస్ బ్యానర్స్‌పై, అనిల్ కడియాల, తిరుమల రెడ్డి నిర్మిస్తున్నారు. గత డిసెంబర్‌లో లాంచ్ చేసిన ఈ సినిమా జనవరి నుండి షూటింగ్ జరుపుకుంటుంది. రీసెంట్‌గా ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్.. హీరోగా కార్తికేయకిది మూడవ సినిమా..
‘గుణ 369’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఈ పోస్టర్‌లో కార్తికేయ షర్ట్ లెస్‌గా ఉన్నాడు.. అతణ్ణి వెనకనుండి చూపించారు. రెండు చేతులు పైకెత్తి తలవెనక పెట్టుకుని ఉన్నాడు. అతని ఫిజిక్ యూత్‌ని ఆకట్టుకంటుంది. కార్తికేయ హీరోగా నటిస్తున్న హిప్పీ మూవీ జూన్ 7న తెలుగు, తమిళ్‌లో రిలీజ్ కానుంది. నాని, విక్రమ్ కుమార్‌ల గ్యాంగ్ లీడర్‌లో కార్తికేయ విలన్‌గా నటిస్తున్నాడు.
Here it is..#Guna369 The High intense realistic emotional drama.Directed by Arjun jandyala, Produced by Tirumal Reddy and Anil Kadiyala. Hope u like my summer look ?
Guna is my name
What is 369? Wait for some more days or guess… pic.twitter.com/JnoFyfXT5a— Kartikeya Gummakonda (@ActorKartikeya) April 26, 2019