సాహోకి అరుదైన ఘనత.. ఫ్యాన్స్ ఫిదా

  • Published By: veegamteam ,Published On : August 23, 2019 / 06:38 AM IST
సాహోకి అరుదైన ఘనత.. ఫ్యాన్స్ ఫిదా

Updated On : August 23, 2019 / 6:38 AM IST

ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో నటించిన సినిమా సాహో. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఆగ‌స్ట్ 30న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఈ సందర్భంగా ప్రభాస్, శ్రద్ధా కలిసి సాహో సినిమా భారీ రేంజ్‌లో ప్ర‌మోట్ చేస్తున్నారు.

అయితే ఇంత వరకు ఏ తెలుగు సినిమా సాధించని అరుదైన ఘనత సాహో సాధించింది. అదేంటంటే.. ఈ సినిమాలో ప్రభాస్ గాగుల్స్ పెట్టుకొని ఉన్న లుక్ ని ట్విట్టర్ ఎమోజీగా విడుదల చేసింది సాహో చిత్ర బృందం. ఇంతకముందు ది లయన్ కింగ్, అవెంజర్స్, స్పైడర్ మాన్, సల్మాన్ భారత్ వంటి సినిమాలకు ఎమోజిలు తయారుచేసింది ట్విట్టర్‌. కానీ తెలుగు సినిమాలలో సాహోకు మాత్రమే ట్విట్టర్ ఎమోజి ఇవ్వడంతో మూవీ యూనిట్ అనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటులు నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, ఎవ్లిన్‌ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ ఇతర కీలక పాత్రల్లో న‌టించారు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, హిందీ, మ‌లయాళం.. ఇలా మొత్తం 5 భాషల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.