ప్రభాస్ ‘జాన్’ సినిమాకు బ్రేక్.. కారణం ఇదే!

  • Published By: vamsi ,Published On : December 31, 2019 / 06:05 AM IST
ప్రభాస్ ‘జాన్’ సినిమాకు బ్రేక్.. కారణం ఇదే!

Updated On : December 31, 2019 / 6:05 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘జాన్’. బాహుబలి, సాహో సినిమాల తర్వాత ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ఇది.  `జాన్‌` సినిమా షూటింగ్ మాత్రం న‌త్త‌న‌డ‌క‌లా సాగుతోంది. ఇప్పటికే సినిమా పూర్తి కావాల్సి ఉండగా.. ఇంకా షూటింగ్ ద‌శ‌లోనే సినిమా ఉంది.

ఈ సినిమా పోగ్రెస్ ఏమిటో, ఎంత షూట్ చేశారో, ఎప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తుందో చిత్ర‌ యూనిట్ కూడా చెప్ప‌లేకపోతుంది. `సాహో` సినిమా హిందీలో ఓ రేంజ్ కలెక్షన్లు తెచ్చుకోగా.. మిగిలిన భాషల్లో మాత్రం పెద్దగా వసూళ్లు రాబట్టలేదు. ఈ ఎఫెక్ట్‌తో స్క్రిప్టులో మార్పులు చేర్పులు ఎక్కువగా చేసుకుంటూ వెళ్తుంది చిత్ర యూనిట్.

బ‌డ్జెట్ త‌గ్గించుకోవ‌డానికి ఇప్పటికే క‌స‌ర‌త్తులు చేస్తుంది. కొన్ని ఖ‌రీదైన ఎపిసోడ్లు తీసేశారు. ఈ క్రమంలోనే సినిమా షూటింగ్‌కి మ‌ళ్లీ బ్రేక్ ప‌డింది. క్రిస్మ‌స్ త‌ర‌వాత కొత్త షెడ్యూలు మొద‌లు కావాలసి ఉండగా.. ఇప్ప‌టి వ‌ర‌కూ అవ్వ‌లేదు. ఇప్పుడు సంక్రాంతి త‌ర‌వాతే షూటింగ్ మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. జ‌న‌వ‌రి 17 నుంచి హైద‌రాబాద్‌లో కొత్త షెడ్యూల్ మొద‌లవుతుందని అంటున్నారు. అన్న‌పూర్ణ స్టూడియోలో కొన్ని సెట్స్‌ వేసి షూటింగ్ చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమా 2020 ద‌స‌రాకి విడుదలవుతుందా? లేక సమ్మర్‌లోనే వస్తుందా? తెలియక అభిమానులు అయోమయంలో ఉన్నారు.