సాహో : ఫస్ట్ డే రికార్డ్ షోస్

ఫ్యాన్స్, ఆడియన్స్ అండ్ మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఈగర్‌గా వెయిట్ చేసిన తరుణం రానే వచ్చింది. భారీ అంచనాల మధ్య సాహో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. యూఎస్‌లో ప్రీమియర్స్ పడగా, ఆంధ్రాలో బెనిఫిట్ షోలు వేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు వేల స్క్రీన్స్‌లో సినిమా విడుదలవుతుంది. ఇక తెలంగాణాలో ఫస్ట్ డే రికార్డ్ స్థాయిలో షోలు వేస్తున్నారు. నైజాంలో మొదటిరోజు దాదాపు 2300ల షోలు పడుతున్నాయని, కేవలం హైదరాబాద్ సిటీలోనే 1160కి పైగా ఆటలు ప్రదర్శించనున్నారని తెలుస్తుంది.
దీంతో గత రికార్డులన్నీ బ్రేక్ అయ్యాయని సినీ పండితులు చెప్తున్నారు. ఇక సాహో ఫస్ట్ డే రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దుబాయ్‌లో సాహో చూడనున్నాడని తెలుస్తుంది..