Virupaksha: విరూపాక్ష-2 పై సాయి ధరమ్ తేజ్ క్లారిటీ.. ఏమన్నాడంటే..?
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ విరూపాక్ష సూపర్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా సీక్వెల్ పై తేజు సాలిడ్ క్లారిటీ ఇచ్చాడు.

Sai Dharam Tej Clarity On Virupaksha 2
Virupaksha: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ ‘విరూపాక్ష’కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కించిన ఈ సినిమా పూర్తి మిస్టిక్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
Virupaksha: మూడు రోజుల్లో అదరగొట్టిన విరూపాక్ష.. హాఫ్ సెంచరీకి చేరువలో తేజు మూవీ!
ఈ సినిమాకు తొలిరోజే పాజిటివ్ రెస్పాన్స్ రాగా, బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ వస్తున్నాయి. తొలిమూడు రోజుల్లో ఈ సినిమా కళ్లుచెదిరే వసూళ్లతో సత్తా చాటడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాపై తాము పెట్టుకున్న నమ్మకం నిజమైనందుకు చిత్ర యూనిట్ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. ఇక ఈ సినిమా సక్సెస్‌తో సాయి ధరమ్ తేజ్ పూర్తి హ్యాపిగా ఉన్నాడు. కాగా, తాజాగా ఆయన ఫ్యాన్స్‌తో ముచ్చటించాడు. ఈ క్రమంలోనే విరూపాక్ష 2 మూవీపై ఓ అభిమాని ప్రశ్నించగా.. ఆ సినిమా ఖచ్చితంగా ఉంటుందనే సినిమాలో హింట్ ఇచ్చినట్లుగా తేజు తెలిపాడు.
Virupaksha Collections : కలెక్షన్స్‌లో మొదటిరోజుని మించిన సెకండ్ డే.. యూఎస్‌లో కూడా దూకుడు!
దీంతో విరూపాక్ష 2 మూవీపై నెలకొన్న అనుమానాలకు తేజు చెక్ పెట్టాడని చెప్పాలి. ఈ సినిమాలో సంయుక్తా మీనన్ పర్ఫార్మెన్స్ ఆమె కెరీర్ బెస్ట్‌గా ఉండటంతో ప్రేక్షకులు ఆమె నటనకు ఫిదా అవుతున్నారు. మరి ఈ సినిమాకు సీక్వెల్‌ను ఎప్పుడు పట్టాలెక్కిస్తారో చూడాలి.
Undhi ane kadha hint ichamu ?
— Sai Dharam Tej (@IamSaiDharamTej) April 24, 2023