Sai Dharam Tej : తిరుపతిలో ఎవరూ హెల్మెట్ ధరించడం లేదు.. ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకోవాలి.. ‘బ్రో’ ప్రమోషన్స్‌లో సాయి ధరమ్ తేజ్..

బ్రో సినిమా నుంచి సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ ని తిరుపతిలోని జయశ్యామ్ థియేటర్ లో చేశారు. ఈ ఈవెంట్ కి హీరో సాయి ధరమ్ తేజ్, దర్శకుడు సముద్రఖని విచ్చేశారు.

Sai Dharam Tej : తిరుపతిలో ఎవరూ హెల్మెట్ ధరించడం లేదు.. ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకోవాలి.. ‘బ్రో’ ప్రమోషన్స్‌లో సాయి ధరమ్ తేజ్..

Sai Dharam Tej Comments in Bro Song Launch Event in Tirupathi

Updated On : July 15, 2023 / 4:40 PM IST

Sai Dharam Tej :  ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan), సుప్రీం హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్‌(Sai Dharam Tej) కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం బ్రో. తమిళంలో ఘ‌న విజ‌యం సాధించిన‌ వినోద‌య సితం (Vinodaya Sitham) సినిమాకి రీమేక్‌గా తెర‌కెక్కుతోంది. సముద్రఖని ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మిస్తోంది. ఈ సినిమా జూలై 28న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను మొద‌లుపెట్టింది. ఇప్పటికే టీజ‌ర్‌, ‘మై డియర్ మార్కండేయ’ అంటూ సాగే క్లబ్ సాంగ్ విడుద‌ల చేయ‌గా అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది.

తాజాగా బ్రో సినిమా నుంచి సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేశారు. జాణవులే.. అంటూ ఈ పాట సాగింది. సాయి ధరమ్ తేజ్, కేతిక శర్మ మధ్య ఇది ఓ లవ్ సాంగ్ లా ఉంది. అయితే ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ ని తిరుపతిలోని జయశ్యామ్ థియేటర్ లో చేశారు. ఈ ఈవెంట్ కి హీరో సాయి ధరమ్ తేజ్, దర్శకుడు సముద్రఖని విచ్చేశారు. భారీగా మెగా అభిమానులు వచ్చారు. టపాకాయలతో సాయి ధరమ్ తేజ్ కి స్వాగతం పలికారు మెగా అభిమానులు.

Baby Collections : ‘బేబీ’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్.. చిన్న సినిమాకి ఈ రేంజ్ లోనా.. పెట్టిన బడ్జెట్ మొదటి రోజే వచ్చేసిందిగా..

ఈ ఈవెంట్ లో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. మామయ్య పవన్ కళ్యాణ్ తో కలిసి సినిమాలో నటించడం నా అదృష్టం. మెగా అభిమానులు, ప్రేక్షకుల ప్రేమ, అభిమానం నాకు కావాలి. బ్రో సినిమా నా లైఫ్ లో మరిచిపోలేని సినిమా. అలాగే తిరుపతిలో ఎవరూ హెల్మెట్ ధరించడం లేదు. నేను గమనించాను. ఇందాక బైక్ ర్యాలీ కూడా చూశాను. ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోలేదు. దయచేసి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రయాణం చేయండి. మీ ప్రేమ నాకు కావాలి అని అన్నారు.