Sai Dharam Tej : నా టాంగో ఇకపై లేదు.. ఎమోషనల్ పోస్ట్ చేసిన సాయి ధరమ్ తేజ్..

తాజాగా తన కుక్క టాంగో చనిపోవడంతో తన కుక్కతో ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. తన కుక్క చిన్నగా ఉన్నప్పుడు మొదటిసారి తీసుకున్న ఫోటోతో పాటు ఓ ఎమోషనల్ లెటర్ షేర్ చేశాడు తేజ్.

Sai Dharam Tej : నా టాంగో ఇకపై లేదు.. ఎమోషనల్ పోస్ట్ చేసిన సాయి ధరమ్ తేజ్..

Sai Dharam Tej Pet Dog Tango passes away he shares emotional post in Social media

Updated On : June 13, 2023 / 10:41 AM IST

Sai Dharam Tej Dog :  పలువురు కుక్కలని(Doigs) పెంచుకుంటూ వాటితో స్పెషల్ బంధం ఏర్పరుచుకుంటారు. సెలబ్రిటీలు కూడా కుక్కలని పెంచుతూ వాటిని తమ ఫ్యామిలీ మెంబర్స్ లా చూస్తారు. హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) కూడా ఎప్పట్నుంచో ఓ కుక్కని పెంచుకుంటున్నారు. తేజ్ తన కుక్కకు టాంగో(Tango) అనే పేరు పెట్టాడు. గతంలో తన కుక్క టాంగోతో కలిసి ఎంజాయ్ చేస్తున్న పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Dasara Movie : దసరా సినిమాకు డబ్బులు ఇవ్వలేదు.. 23 మందికి నేనే ఇచ్చాను.. 70 వేలు లాస్.. సంచలన వ్యాఖ్యలు చేసిన సింగర్..

తాజాగా తన కుక్క టాంగో చనిపోవడంతో తన కుక్కతో ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. తన కుక్క చిన్నగా ఉన్నప్పుడు మొదటిసారి తీసుకున్న ఫోటోతో పాటు ఓ ఎమోషనల్ లెటర్ షేర్ చేశాడు తేజ్. ఈ లెటర్ లో.. నిన్ను తలుచుకున్నప్పుడు నా మనసు ఆనందంగా ఉంటుంది. నువ్వు లేకపోతే చాలా కష్టంగా ఉంది. నన్ను నువ్వు రక్షించావు, నవ్వించావు. నా కష్టాల్లోనూ, నా సంతోషాల్లోనూ నువ్వు నాతో ఉన్నావు. నాకు ఎంతో ప్రేమను ఇచ్చిన నిన్ను పొందడం నా అదృష్టం. నువ్వు నా జీవితంలోకి వచ్చిన మొదటి రోజు ఇప్పటికి స్పెషల్ మూమెంట్ లాగా గుర్తుంది. లవ్ యు మై బండ ఫెలో.. టాంగో.. అంటూ రాశాడు తేజ్. దీంతో పలువురు అభిమానులు, నెటిజన్లు కూడా బాధగా కామెంట్స్ చేస్తున్నారు.