Sai Pallavi : నేషనల్ వార్ మెమోరియల్ వద్ద సాయి పల్లవి.. దేశం కోసం ప్రాణాలు విడిచిన సైనికులకు నివాళులు..

సాయి పల్లవి మేజర్ ముకుంద్ వరదరాజన్ తో పాటు మిగిలిన దివంగత సైనికులకు నివాళులు అర్పించింది.

Sai Pallavi : నేషనల్ వార్ మెమోరియల్ వద్ద సాయి పల్లవి.. దేశం కోసం ప్రాణాలు విడిచిన సైనికులకు నివాళులు..

Sai Pallavi Pays Tributes to Major Mukund Varadarajan at National War memorial

Updated On : October 28, 2024 / 9:38 AM IST

Sai Pallavi : శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన అమరన్ సినిమా అక్టోబర్ 31న రిలీజ్ కానుంది. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా భారత ఆర్మీకి చెందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథతో తెరకెక్కించారు. ఈ క్రమంలో సాయి పల్లవి నేషనల్ వార్ మెమోరియల్ వద్ద దేశం కోసం మరణించిన సైనికులకు నివాళులు అర్పించి ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.

Also Read : Jani Master : అర్ధరాత్రి హైవేపై యాక్సిడెంట్.. కాపాడిన జానీ మాస్టర్.. దయచేసి అంటూ ఎమోషనల్ పోస్ట్.. వీడియో వైరల్..

దేశం కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన సైనికులకు గుర్తుగా ఢిల్లీలో నేషనల్ వార్ మెమోరియల్ ఉంది. అక్కడ మరణించిన సైనికుల వివరాలు ఒక్కో సైనికుడికి ఒక్కో ఇటుక రూపంలో ఉంటాయి. అక్కడికి వెళ్లిన సాయి పల్లవి మేజర్ ముకుంద్ వరదరాజన్ తో పాటు మిగిలిన దివంగత సైనికులకు నివాళులు అర్పించింది.

Sai Pallavi Pays Tributes to Major Mukund Varadarajan at National War memorial

ఆ ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. నేను అమరన్ ప్రమోషన్స్ మొదలుపెట్టే ముందు నేషనల్ వార్ మెమోరియల్ సందర్శించాలి అనుకున్నాను. ఇటీవల కొన్ని రోజుల క్రితం వెళ్ళాను. మనకోసం ప్రాణాలు అర్పించిన సైనికుల గురించి ఇటుకల లాంటి పలకల రూపంలో వారి వివరాలు ఉంచే పవిత్రమైన ఆలయం ఇది. మేజర్ ముకుంద్ వరదరాజన్, సిపాయి విక్రమ్ సింగ్ లకు నివాళులు అర్పిస్తున్నప్పుడు నేను చాలా ఎమోషనల్ అయ్యాను అని పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారగా సాయి పల్లవి అక్కడికి వెళ్లి నివాళులు అర్పించినందుకు ఆమెని అభినందిస్తున్నారు.