Saint Von Colucci : అతడిలా కనిపించేందుకు 12 సర్జరీలు.. చివరికి ప్రాణం పోగొట్టుకున్న నటుడు!

BTS సింగర్ లా కనిపించేందుకు 12 సర్జరీలు చేయించుకొని కెనడియన్ నటుడు ప్రాణం వదిలాడు.

Saint Von Colucci : అతడిలా కనిపించేందుకు 12 సర్జరీలు.. చివరికి ప్రాణం పోగొట్టుకున్న నటుడు!

Saint Von Colucci passed away due to surgeries BTS singer Jimin

Updated On : April 25, 2023 / 9:43 PM IST

Saint Von Colucci : సినీ పరిశ్రమలో ఉండే పలువురు అందంగా కనిపించేందుకు పలు సర్జరీలు చేయించుకున్నారని మనం వింటూనే ఉంటాం. అయితే ఆ సర్జరీలు కొన్నిసార్లు ప్రాణాలు మీదకు వస్తాయి. అలా ఒక హాలీవుడ్ నటుడు ఏకంగా తన ప్రాణాలనే కోల్పోయాడు. కెనడాకి చెందిన ‘సెయింట్ వాన్ కొలూచి’ (Saint Von Colucci) ఆదివారం దక్షిణ కొరియాలో మరణించినట్లు సమాచారం. ఈ నటుడు ప్రముఖ BTS గాయకుడు జిమిన్ (Jimin) లాగా కనిపించేందుకు ఏకంగా 12 సర్జరీలు చేయించుకున్నాడు.

RRR : జపాన్ లో RRR క్రేజ్ తగ్గేదేలే అంటుంది.. టైటానిక్ రికార్డు!

ముఖం, ముక్కు, కన్ను సహా 12 సర్జరీల కోసం సెయింట్ వాన్ 2 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ సర్జరీలు వల్ల కలిగిన ఇన్‌ఫెక్షన్‌ వలెనే సెయింట్ వాన్ 22 ఏళ్ళ వయసులో ప్రాణాలు కోల్పుయినట్లు సమాచారం. సర్జరీలో భాగంగా శనివారం (ఏప్రిల్ 22) తన దవడకు అమర్చిన ఇంప్లాంట్స్‌ తొలిగించడం జరిగింది. అయితే ఆ సర్జరీ అయిన కొన్ని గంటలోనే ఇన్‌ఫెక్షన్‌ సోకి సెయింట్ వాన్ ఊపిరి వదిలాడు. ఈ విషయం హాలీవుడ్ ఆడియన్స్ మరియు టెక్నీషియన్స్ ని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేస్తుంది.

Gopichand : మీ తండ్రిని చూసి అవకాశం ఇచ్చా.. నువ్వేం పీకావ్.. గోపీచంద్ పై తేజ కామెంట్స్!

కాగా సెయింట్‌ వాన్ 2019లో కెనడా నుంచి సౌత్‌ కొరియాకు వెళ్ళాడు. అక్కడ పాప్ ఇండస్ట్రీలో ఉన్నత స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతో కొరియా చేరుకున్న సెయింట్‌ వాన్.. ఇప్పుడు ఇలా ప్రాణాలు వదలడం అందర్నీ బాధిస్తుంది.