Saira Banu : ఆ రోజుల్లో ఉన్న 22 అంగుళాల నడుము ఇప్పుడు లేదు.. పాత ఫోటోతో ఆసక్తికర పోస్ట్ చేసిన సీనియర్ హీరోయిన్..
తాజాగా 78 ఏళ్ళ వయసులో సైరా భాను ఇన్‌స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే సైరా భాను ఇన్‌స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో అప్పటి అభిమానులు, పలువురు ప్రముఖులు ఆమెని ఫాలో అవుతున్నారు.

Saira Banu post her young age pic in Instagram and its goes viral
Saira Banu Instagram Post : సైరా భాను.. 1960, 70వ దశకాల్లో బాలీవుడ్(Bollywood) స్టార్ హీరోయిన్. అప్పట్లో ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా ఉండేది కాదు. అప్పటి స్టార్ హీరో, దివంగత నటుడు దిలీప్ కుమార్(Dilip Kumar) ని తక్కువ ఏజ్ లోనే పెళ్లి చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటించింది. హీరోయిన్ గా కెరీర్ అయిపోయిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అనేక సినిమాలు చేసింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగానే ఉంటుంది.
తాజాగా 78 ఏళ్ళ వయసులో సైరా భాను ఇన్‌స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే సైరా భాను ఇన్‌స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో అప్పటి అభిమానులు, పలువురు ప్రముఖులు ఆమెని ఫాలో అవుతున్నారు. ఇక ఆమె సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన దగ్గర్నుంచి పాత ఫోటోలని షేర్ చేస్తూ ఆసక్తికర పోస్టులు చేస్తుంది. తాజాగా సైరా భాను తన యంగ్ ఏజ్ లో ఉన్న ఓ పాత ఫోటో షేర్ చేసింది.
Bawaal Trailer : ప్రపంచ యుద్ధానికి, ప్రేమకథకు సంబంధం ఏంటి?.. జాన్వీ కపూర్ ‘బవాల్’ ట్రైలర్ రిలీజ్
సైరా భాను ఈ ఫొటోలో పంజాబీ డ్రెస్ వేసుకొని ఎంతో అందంగా, క్యూట్ గా ఉంది. ఈ ఫోటోని షేర్ చేస్తూ.. ఆ రోజుల్లో 22 అంగుళాల నడుము ఉన్న రోజులు గడిచిపోయాయి. ఆ రోజుల్లో గడిచిన సమయం, జ్ఞాపకాలు మాత్రం శాశ్వతంగా నిలిచిపోతాయి అని పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. ఇప్పటి యువత ఈ ఫోటోని చూసి అప్పట్లో సైరా భాను ఎంత అందంగా ఉందో, స్టార్ హీరోయిన్ అవ్వాలంటే మరి ఆ మాత్రం ఉండాలి అని కామెంట్స్ చేస్తున్నారు.