Prabhas : ఫ్యాన్స్‌కి ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్ రెడీ.. గెట్ రెడీ రెబల్స్..

అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు వేడుకకు తన సినిమాల నుంచి ఎటువంటి గిఫ్ట్స్ రాబోతున్నాయి అంటూ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

Prabhas : ఫ్యాన్స్‌కి ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్ రెడీ.. గెట్ రెడీ రెబల్స్..

Salaar star Prabhas birthday movie updates

Updated On : October 20, 2023 / 7:21 AM IST

Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు వచ్చేసింది. అక్టోబర్ 23న ఈ బర్త్ డేని గ్రాండ్ గా జరిపేందుకు అభిమానులు సిద్ధమవుతున్నారు. ఇక వేడుకకు ప్రభాస్ సినిమాల నుంచి ఎటువంటి గిఫ్ట్స్ రాబోతున్నాయి అంటూ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ నుంచి ‘సలార్’ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. దీంతో ఈ మూవీ నుంచి ఒక ట్రైలర్ లేదా ప్రభాస్ కి సంబంధించిన గ్లింప్స్ ని ఆశిస్తున్నారు. అయితే మూవీ టీం నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ లేదు.

ఇది ఇలా ఉంటే, అభిమానులు ఈ బర్త్ డేని ప్రభాస్ సూపర్ హిట్ మూవీ ‘ఛత్రపతి’తో సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ బ్లాక్ బస్టర్ మూవీని 4K లో రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేశారు. అక్టోబర్ 23న ఈ మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. రాజమౌళి, ప్రభాస్ కలయికలో వచ్చిన మొదటి మూవీ ఇది. సినిమాలోని యాక్షన్ సీన్స్, సెంటిమెంట్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. శ్రియా సరన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

Also read : Rathika Rose : భగవంత్ కేసరి సినిమాలో ఇటీవల ఎలిమినేట్ అయిన బిగ్‌బాస్ భామ.. ఎవరు? ఏ పాత్రలో?

కాగా ప్రభాస్ సలార్ తో పాటు కల్కి 2898 AD, దర్శకుడు మారుతీ సినిమాల్లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీస్ నుంచి కూడా ఏమన్నా అప్డేట్స్ వస్తాయా లేదా చూడాలి. 2024 సంక్రాంతికి వస్తానని ప్రకటించిన కల్కి పోస్టుపోన్ అయ్యిందని సమాచారం. అయితే మూవీ టీం క్లారిటీ, అలాగే కొత్త రిలీజ్ డేట్ ని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక మారుతీ సినిమాని ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. మరి ఈ పుట్టినరోజున అయిన ఈ మూవీని అనౌన్స్
అఫీషియల్ గా చేస్తారా అని ఎదురు చూస్తున్నారు.