బికినీలో అనుష్క బేబి బంప్.. సమంత ఏమందంటే..

Anushka Sharma -Samantha Akkineni: విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. త్వరలో తాము ముగ్గురం కానున్నాం అని ఈ స్టార్ కపుల్ ప్రకటించినప్పటినుంచి పలువురు సినీ, క్రికెట్, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.
కోహ్లీ ప్రస్తుతం యూఏఈలో ఐపీఎల్ ఆడుతుండగా.. గర్భవతి అయిన అనుష్క హాయిగా రిలాక్స్ అవుతోంది. ఇటీవల బేబి బంప్ పిక్ పోస్ట్ చేసిన అనుష్క బేబీ బంప్‌తో బికినీలో ఉన్న కొత్త ఫొటోను సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఫొటోపై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. టాలీవుడ్ ప్రముఖ కథానాయిక సమంత కూడా ఈ ఫొటోపై కామెంట్ చేసింది. బేబీ బంప్‌తో, బ్లాక్ స్విమ్ సూట్‌లో అనుష్క ‘దేవత’లా ఉందని సమంత కామెంట్ చేసింది. త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న అనుష్కకు సెలబ్రిటీలే కాదు ఎంతో మంది సామాన్యులు కూడా శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.
https://www.instagram.com/p/CFZXmQTJV_e/?utm_source=ig_web_copy_link