Chay Sam BreakUp: సమంత ప్రకటన చూడగానే నా మైండ్ బ్లాంక్ అయ్యింది – జోసఫ్ ప్రభు

నాగ చైతన్య, సమంత విడాకుల విషయమై మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది.

Chay Sam BreakUp: సమంత ప్రకటన చూడగానే నా మైండ్ బ్లాంక్ అయ్యింది – జోసఫ్ ప్రభు

Joseph

Updated On : October 5, 2021 / 11:37 AM IST

Joseph Prabhu: అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోతున్నట్లు ప్రకటించిన వార్త టాలీవుడ్‌లోనే కాదు కోలీవుడ్, బాలీవుడ్‌లో కూడా హాట్ టాపిక్ అయ్యింది. ఇద్దరూ విడిపోతున్నట్టుగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించడంపై ఇరు కుటుంబాలు షాక్ అయ్యాయి. వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించిన తర్వాత నాగచైతన్య తండ్రి నాగార్జున స్పందించారు.

సామ్‌, చైలు విడిపోవటం దురదృష్టకరమని, భార్యాభర్తల మధ్య ఏం జరిగినా అది వాళ్ల వ్యక్తిగతమని, విడిపోయినా వాళ్లు తన గుండెల్లో ఉంటారంటూ చెప్పుకొచ్చారు. లేటెస్ట్‌గా సమంత తండ్రి జోసఫ్ ప్రభు కూడా వీరు విడిపోతున్నట్లు ప్రకటించిన విషయంపై స్పందించారు.

తన కూతురు విడాకుల గురించి తెలియగానే ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిందన్నారు. అయితే తన కూతురు అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని అభిప్రాయపడ్డారు జోసఫ్. త్వరలోనే ఈ పరిస్థితులు చక్కబడతాయని జోసెఫ్ ప్రభు ఆశాభావం వ్యక్తం చేశారు.

వీళ్లిద్దరు విడిపోవడానికి ముఖ్యకారణం.. ‘ది ప్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌తో పాటు ‘సూపర్ డీలక్స్’ సినిమాల్లో సమంత రెచ్చిపోయి నటించడమే అని కొందరు అనుకుంటున్నారు. విడాకుల నిర్ణయంతో అటు అక్కినేని ఫ్యాన్స్, ఇటు సమంత ఫ్యాన్స్ కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు.