Sundeep Kishan : 3 లవ్ స్టోరీలు.. ఒక్కటీ వర్కవుట్ కాలేదు.. బయటపెట్టిన సందీప్ కిషన్
సందీప్ కిషన్ ముగ్గురిని లవ్ చేసారట. అందరూ ఇండస్ట్రీ వాళ్లేనట.. వాళ్లెవరో తెలియకుండా చాలా సీక్రెట్‌గా మేనేజ్ చేసారట.. రీసెంట్ ఇంటర్వ్యూలో సందీప్ ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసారు.

Sundeep Kishan
Sundeep Kishan : హీరో సందీప్ కిషన్‌కి 3 బ్రేకప్ స్టోరీలు ఉన్నాయట. ఆ ముగ్గురు వ్యక్తులు ఇండస్ట్రీకి చెందిన వారేనట. రీసెంట్ ఇంటర్వ్యూలో తన బ్రేకప్, పెళ్లి విషయంలో సందీప్ కిషన్ చెప్పిన మాటలు ఆసక్తికరంగా మారాయి.
Vyooham – Shapadham Trailer : వ్యూహం, శపథం ట్రైలర్ రిలీజ్ చేసిన ఆర్జీవీ..
సందీప్ కిషన్ లేటెస్ట్ మూవీ ‘ఊరి పేరు భైరవకోన’ ఫిబ్రవరి 16న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. వీఐ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ ఫాంటసీ మూవీలో వర్ష బొల్లమ్మ, కావ్య తాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా హీరో సందీప్ కిషన్ ఈ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంలో తన బ్రేకప్ స్టోరీలతో పాటు.. పెళ్లి గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసారు.
Sai Dharam Tej : స్టూడెంట్స్‌ని రిక్వెస్ట్ చేస్తూ సాయి ధరమ్ తేజ్ పిలుపు.. ఎందుకోసమో తెలుసా?
సందీప్ కిషన్ ముగ్గుర్ని లవ్ చేసారట. ఫస్ట్ లవ్ నాలుగేళ్లు.. సెకండ్ లవ్ రెండేళ్లు.. థర్డ్ లవ్ రెండున్నరేళ్లు నడిచాయట. అయితే ఏది వర్కవుట్ కాలేదని చెప్పారు సందీప్. తను ప్రేమించిన వారంతా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులే అని.. వాళ్ల గురించి ఎవరికీ తెలియదని బయటకు రాకుండా తాను చాలా కేర్ ఫుల్‌గా ఉంటానని సందీప్ చెప్పారు. ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఆలోచన లేదన్నారు.. ఇటీవల కాలంలో చాలా పెళ్లిళ్లు నిలబడట్లేదని.. పెళ్లి చేసుకుంటే జీవితకాలం కలిసి ఉండాలని.. పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకోవాలంటే చాలా ఆలోచించాలని సందీప్ కిషన్ చెప్పుకొచ్చారు. సందీప్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.