Sandeep Vanga : ప్రపంచంలో ఉన్న బూతులు అన్నీ ‘మీర్జాపూర్’లోనే ఉన్నాయ్.. ముందు మీ సంగతి మీరు చూసుకోండి.. సందీప్ వంగ కౌంటర్..
బాలీవుడ్ ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ ఇటీవల.. యానిమల్ లాంటి సినిమాలు హిట్ అయితే సమాజానికి ప్రమాదకరం అని, సినిమాలో ఉన్న కొన్ని సీన్స్ ని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. వీటికి సందీప్ వంగ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సమాధానమిస్తూ కౌంటర్ ఇచ్చాడు.

Sandeep Reddy Vanga Counter to Bollywood writer Javed Akhtar Comments on Animal Movie
Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి వంగ రెండు సినిమాలతోనే బాలీవుడ్ ని ఏలే స్థాయికి వెళ్ళిపోయాడు. ఇటీవల రణబీర్ కపూర్(Ranbir Kapoor) హీరోగా వచ్చిన యానిమల్(Animal) సినిమా ఏకంగా 800 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి అదరగొట్టింది. అయితే ఈ సినిమాలో వైలెన్స్ ఎక్కువ ఉందని, కొన్ని సీన్స్ లో మహిళలని అవమాపరిచారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. సందీప్ వంగ మొదటి సినిమా నుంచి కూడా ఇలాంటి విమర్శలు చాలా ఎదుర్కున్నా ఒక్కోసారి పట్టించుకోకుండా వదిలేస్తాడు. ఒక్కోసారి మాత్రం స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తాడు.
ఇటీవల బాలీవుడ్ లో పలువురు ప్రముఖులు యానిమల్ సినిమాపై విమర్శలు చేస్తుండటంతో సందీప్ వంగ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అందరికి కౌంటర్లు ఇచ్చాడు. ఇప్పటికే అమీర్ మాజీ భార్య కిరణ్ రావు చేసిన వ్యాఖ్యలకు మీ మాజీ భర్త కూడా అలాంటి సినిమాలు చేసాడని కౌంటర్ ఇచ్చిన సందీప్ వంగ తాజాగా జావేద్ అక్తర్ కి కౌంటర్ ఇచ్చాడు.
బాలీవుడ్ ప్రముఖ రచయిత జావేద్ అక్తర్(Javed Akhtar) ఇటీవల.. యానిమల్ లాంటి సినిమాలు హిట్ అయితే సమాజానికి ప్రమాదకరం అని, సినిమాలో ఉన్న కొన్ని సీన్స్ ని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. వీటికి సందీప్ వంగ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సమాధానమిస్తూ కౌంటర్ ఇచ్చాడు.
Also Read : Upasana : నేను, చరణ్.. ఇద్దరం ఇక్కడే పుట్టాం.. మా ఇద్దరికీ ఈ సిటీ అంటే చాలా ఇష్టం.. ఏ సిటీనో తెలుసా?
సందీప్ వంగ మాట్లాడుతూ.. ఆయన చేసిన కామెంట్స్ చూస్తుంటే అసలు సినిమా చూడలేదని తెలుస్తుంది. సినిమా చూడకుండా ఇలా కామెంట్స్ చేసేవాళ్ళ గురించి ఏం మాట్లాడతాం. అయినా ఇలా కామెంట్స్ చేసేవాళ్ళు తమ చుట్టుపక్కల పరిసరాల్ని పట్టించుకోరేమో. జావేద్ కొడుకు ఫర్హాన్ అక్తర్ నిర్మించిన మీర్జాపూర్ వెబ్ సిరీస్ లో ప్రపంచంలో ఉన్న బూతులు అన్నీ ఉన్నాయి. తెలుగులో అయితే అసలు ఆ సిరీస్ చూడలేము కూడా. మరి తన కొడుక్కి ఎందుకు చెప్పలేదు? తన కొడుకు చేస్తున్న పని ఎందుకు చెక్ చెయ్యట్లేదు అని ప్రశ్నించాడు.
దీంతో సందీప్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇలా తన సినిమాలపై, తనపై కొంతమంది చేస్తున్న విమర్శలకు సందీప్ వంగ స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నాడు. ఈ సినిమాలకే ఇలా అయిపోతే సందీప్ నుంచి రాబోయే మరిన్ని సినిమాలకి వీరంతా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.